Kabul airport: త్వరలో పూర్తి స్థాయిలో కాబుల్‌ విమానాశ్రయ సేవలు

తాజా వార్తలు

Published : 04/09/2021 19:59 IST

Kabul airport: త్వరలో పూర్తి స్థాయిలో కాబుల్‌ విమానాశ్రయ సేవలు

కాబుల్‌: కాబుల్‌లోని హమీద్‌ కర్జాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం కార్యకలాపాల పునరుద్ధరణకు ముమ్మర చర్యలు తీసుకుంటున్నట్లు అఫ్గాన్‌లోని కతర్‌ రాయబారి సయీద్‌ బిన్‌ ముబారక్‌ అల్‌ ఖయారిన్‌ వెల్లడించారు. ఈ విషయాన్ని శనివారం ఓ న్యూస్‌ ఛానల్‌ పేర్కొంది. ఇక్కడి పౌరులకు మానవతా సాయం అందించేందుకు వచ్చే విమానాల కోసం ఇప్పటికే రన్‌ వేను సిద్ధం చేసినట్లు ఆయన తెలిపారు. మజారే షరీఫ్‌, కాందహార్‌కు రెండు విమానాల రాకపోకలు ఇప్పటికే మొదలయ్యాయని, త్వరలో పౌర విమాన సర్వీసులు ప్రారంభమవుతాయని చెప్పారు. కతర్‌ విదేశాంగ మంత్రి షేక్ మొహమ్మద్ బిన్ అబ్దుల్‌ రహ్మాన్ అల్-థానీ సైతం గురువారం దోహాలో ఇదే విషయాన్ని తెలిపారు. కాబుల్‌ విమానాశ్రయ సేవల పునరుద్ధరణకు సాంకేతిక మద్దతు కోసం టర్కీతో కలిసి పనిచేస్తున్నట్లు చెప్పారు.

అమెరికన్‌ బలగాల నిష్ర్కమణతో మూసివేత..

ఆగస్టు నెలాఖరులో అమెరికన్‌ బలగాల నిష్ర్కమణతో ఈ ఎయిర్‌పోర్ట్‌ తాలిబన్ల చేతిలోకి వెళ్లిపోయిన విషయం తెలిసిందే. అప్పటినుంచి దీన్ని మూసిఉంచారు. ఆగస్టు 30 అర్ధరాత్రి అమెరికాకు చెందిన ఆఖరు విమానం ‘లార్జ్‌ సీ-17’ ఇక్కడి నుంచి టేకాఫ్‌ అయింది. తాలిబన్లు కాబుల్‌ను ఆక్రమించిన దరిమిలా.. అఫ్గాన్‌ను వదిలి వెళ్లేందుకు వేలాది మంది ప్రజలు ఈ విమానాశ్రయానికి పోటెత్తారు. కాల్పులు, తొక్కిసలాటలు, బాంబు పేలుళ్లతో విమానాశ్రయం, పరిసరాల్లో ఆందోళనకర పరిస్థితులు కొనసాగాయి. అమెరికా, భారత్‌ తదితర దేశాలు పౌరులను తరలించేందుకు భారీ సంఖ్యలో విమానాలు నడిపాయి.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని