అమ్మాయిలు సింగిల్‌గా ఉండేందుకు ఇష్టపడుతున్నారు.. కర్ణాటక మంత్రి వ్యాఖ్యలు

తాజా వార్తలు

Published : 11/10/2021 23:06 IST

అమ్మాయిలు సింగిల్‌గా ఉండేందుకు ఇష్టపడుతున్నారు.. కర్ణాటక మంత్రి వ్యాఖ్యలు

బెంగళూరు: మహిళలను ఉద్దేశించి కర్ణాటక ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్‌ కె.సుధాకర్‌ వివాదస్పద వ్యాఖ్యాలు చేశారు. ఆదివారం జరిగిన నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెంటల్‌ హెల్త్‌ అండ్‌ న్యూరోసైన్స్‌ (ఎన్‌ఐఎంహెచ్‌ఎఎన్‌ఎస్‌) 25వ కాన్వకేషన్‌కు ముఖ్య అతిథిగా హాజరైన ఆయన... నేటి మహిళలను ఉద్దేశించి పలు వ్యాఖ్యలు చేశారు. ‘‘ఈ విషయాన్ని చెప్పడం కాస్త బాధాకరంగా భావిస్తున్నా. దురదృష్టవశాత్తూ.. మన సమాజంపై పాశ్చాత్య ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. తల్లిదండ్రులతో ఉండేందుకు యువత ఏమాత్రం ఆసక్తి కనబరచడం లేదు. భారతదేశంలో నేటితరం మహిళలు సింగిల్‌గా ఉండాలనుకుంటున్నారు. ఒకవేళ వివాహమైనా సరే! పిల్లలను కనాలనే ఉద్దేశం వారిలో ఉండటం లేదు. ఒకవేళ జన్మనివ్వాలనుకుంటే.. సరోగసీ బాట పడుతున్నారు. కాబట్టి వారి ఆలోచనల్లో మార్పు వచ్చిందని చెప్పొచ్చు. ఇది ఏమాత్రం మంచి పరిణామం కాదు’’ అని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ విషయంపై సామాజిక మాధ్యమాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే అధిక శాతం మహిళలు ఈ విషయాన్ని అంగీకరించడం గమనార్హం. మరికొంతమంది ఎందుకు కేవలం ఆడవాళ్లనే తప్పుబడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని