Centre to Kerala: కేరళలో ‘వ్యూహాత్మక లాక్‌డౌన్‌’ అవసరమన్న కేంద్రం

తాజా వార్తలు

Published : 01/09/2021 23:01 IST

Centre to Kerala: కేరళలో ‘వ్యూహాత్మక లాక్‌డౌన్‌’ అవసరమన్న కేంద్రం

దిల్లీ: కరోనా వైరస్‌ అన్ని రాష్ట్రాల్లో అదుపులోనే ఉన్నట్లు కనిపిస్తున్నప్పటికీ కేరళలో మాత్రం విజృంభిస్తోంది. దేశంలో నమోదవుతున్న 70 శాతం కేసులు ఈ రాష్ట్రం నుంచే వెలుగుచూస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే పినరయి ప్రభుత్వానికి కేంద్రం పలు సూచనలు చేసినట్లు తెలుస్తోంది. కేరళలో ‘వ్యూహాత్మక లాక్‌డౌన్‌’ అవసరమని కేంద్ర హోంశాఖ వెల్లడించినట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. ఇళ్లల్లో చికిత్స పొందుతున్నవారు కొవిడ్‌ నిబంధనలు పాటించడం లేదని.. వారిపై దృష్టి వహించాలని ప్రభుత్వానికి సూచించింది. అందుకే కేరళలో కరోనా కేసులు తగ్గడంలేదని ఆరోగ్య శాఖ అన్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. మైక్రో కంటైన్‌మెంట్‌ జోన్లను ఏర్పాటు చేయాలని, కఠిన నిబంధనలు అమల్లోకి తీసుకురావాలని ఆరోగ్య శాఖ సూచించినట్లు వివరించాయి.

కేరళలో కొవిడ్ సంక్రమణ వ్యాప్తి ఇళ్లలోనే ఎక్కువగా ఉంటున్నట్లు పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి. 35శాతం కేసులు ఇళ్లలోనే కుటుంబసభ్యులకు సంక్రమిస్తున్నాయని ఓ అధ్యయనంలో తేలింది.  ప్రజలు కొవిడ్ నిబంధనలను నిర్లక్ష్యం చేయడం, వైరస్‌ ముప్పు ఉన్నవారి సంఖ్య ఎక్కువగా ఉండడం వంటివి కరోనా విజృంభణకు కారణాలుగా నిపుణులు పేర్కొంటున్నారు.

ప్రభుత్వం కొవిడ్‌ కట్టడి చర్యలు తీసుకుంటున్నా .. వ్యాక్సినేషన్‌ జరుగుతున్నా కేరళలో వైరస్‌ ఉద్ధృతి మాత్రం ఆగడంలేదు. దీంతో మళ్లీ రాత్రి కర్ఫ్యూ విధించాలని పినరయి సర్కారు నిర్ణయించింది. ఆగస్టు 30 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా రాత్రి 10గంటల నుంచి ఉదయం 6గంటల వరకు కర్ఫ్యూ విధించింది. కాగా కేరళ నుంచి తమ రాష్ట్రానికి వచ్చేవారు వారంరోజుల పాటు క్వారంటైన్‌లో ఉండాలని కర్ణాటక ప్రభుత్వం ఈ మధ్యే నిర్ణయించింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని