Covid: కేరళలో తగ్గని కరోనా ఉద్ధృతి.. మళ్లీ అదే స్థాయిలో కేసులు!

తాజా వార్తలు

Published : 04/08/2021 22:17 IST

Covid: కేరళలో తగ్గని కరోనా ఉద్ధృతి.. మళ్లీ అదే స్థాయిలో కేసులు!

తిరువనంతపురం: కేరళలో కరోనా ఉద్థృతి ఆందోళనకర రీతిలో కొనసాగుతోంది. బుధవారం ఒక్కరోజే అక్కడ కొత్తగా 22,414 మందికి వైరస్‌ సోకగా.. 108 మంది కొవిడ్‌తో మృతి చెందడం కలవరపెడుతోంది. తాజా గణాంకాల ప్రకారం రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 34,71,563..  మరణాల సంఖ్య 17,211కి చేరింది. గడిచిన 24 గంటల్లో 1,97,092 శాంపిళ్లను పరీక్షించగా పాజిటివిటీ రేటు 11.37 శాతంగా నమోదైంది. 19,478 మంది కొవిడ్‌ నుంచి కోలుకున్నారు. అయితే ఒక్క రోజులో కోలుకున్నవారి సంఖ్య కంటే ఎక్కువ కేసులు నమోదు కావడం ఆందోళన కలిగించే అంశం. అధికారిక లెక్కల ప్రకారం రాష్ట్రంలో 1,76,048 క్రియాశీల కేసులున్నాయి. కరోనా వ్యాప్తి కట్టడిలో భాగంగా పలు జిల్లాల్లో 4,74,056 మంది కదలికలపై ప్రభుత్వం నిఘా పెట్టింది.

ఓ వైపు కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండగా మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం బుధవారం పలు ఆంక్షలను సడలించింది. వారాంతపు లాక్‌డౌన్‌ ఇకపై ఆదివారం మాత్రమే విధించనున్నట్టు రాష్ట్ర సర్కారు తెలిపింది. అయితే స్వాతంత్ర్య దినోత్సవం, ఓనమ్‌ పర్వదినాల సందర్భంగా ఈ నెల 15, 22 తేదీల్లో లాక్‌డౌన్‌కు మినహాయంపు కల్పిస్తున్నట్టు వెల్లడించింది. అన్ని దుకాణాలను ఆదివారం మినహా ప్రతిరోజు ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు తెరచి ఉంచేందుకు అనుమతులిచ్చింది.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని