Kerala: మరింత పెరిగిన పాజిటివిటీ రేటు..!

తాజా వార్తలు

Published : 19/07/2021 23:16 IST

Kerala: మరింత పెరిగిన పాజిటివిటీ రేటు..!

తిరువనంతపురం: కేరళలో కరోనా విలయం కొనసాగుతోంది. కొద్ది వారాలుగా రాష్ట్రంలో 10 శాతంగా ఉన్న వైరస్‌ పాజిటివిటీ రేటు తాజాగా 11.08 శాతానికి పెరగడం ఆందోళన కలిగిస్తోంది. వైరస్‌ ఉద్ధృతి పెరగడంతో అక్కడ గడిచిన 24 గంటల్లో కొత్తగా 9,931 కేసులు, 58 మరణాలు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 31,70,868, మొత్తం మరణాల సంఖ్య 15,408కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఓ ప్రకటన విడుదల చేసింది. అధికారిక లెక్కల ప్రకారం.. గత 24 గంటల్లో 13,206 మంది కోలుకోగా.. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు మొత్తం కోలుకున్నవారి సంఖ్య 30,33,258కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 1,21,708 క్రియాశీల కేసులున్నాయి.

రాష్ట్రంలోని 567 ప్రాంతాల్లో పాజిటివిటీ రేటు 10 శాతానికి మించి నమోదైంది. దీనిపై ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్‌ స్పందించారు. వివాహాల వంటి వేడులను ఎక్కువగా నిర్వహించిన ప్రాంతాల్లోనే పాజిటివిటీ రేటు గణనీయంగా పెరిగినట్లు ఆమె తెలిపారు. మహమ్మారి వ్యాప్తి కారణంగా అత్యంత విపత్కర పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో కొవిడ్‌ నిబంధనలను పాటిస్తూ వేడులకను నిర్వహించుకోవాలని ప్రజలకు సూచించారు. 

 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని