పది మంది అతిథులా.. డిన్నర్‌కి రండి

తాజా వార్తలు

Published : 27/04/2021 01:03 IST

పది మంది అతిథులా.. డిన్నర్‌కి రండి

వినూతన్న రీతిలో అవగాహన కల్పిస్తున్న మధ్యప్రదేశ్‌ పోలీసులు

భోపాల్‌: రాష్ట్ర ప్రభుత్వం వివాహాది శుభకార్యాలకు 50 మందిని మాత్రమే అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేయగా ప్రజలు వాటిని ఉల్లంఘిస్తున్నారు. ఈ తరుణంలో కరోనా నిబంధనల పట్ల అవగాహన కలిగించేందుకు భిండ్‌ సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్ మనోజ్‌ కుమార్‌ సింగ్‌ వధూవరులకు వినూత్న ఆఫర్‌ ఇచ్చారు. 10 మంది కన్నా తక్కువ అతిథుల నడుమ పెళ్లి చేసుకుంటే.. ఆ జంటను తన ఇంటికి తీసుకెళ్లి విలాసవంతమైన గాలా డిన్నర్‌ ఏర్పాటు చేసి, భోజనం పెట్టిస్తానని ప్రకటించారు. ఆ జంటకు ప్రోత్సాహకంగా మెమొంటోలు కూడా ఇస్తామన్నారు. వధూవరులను తీసుకెళ్లడానికి ప్రభుత్వ వాహనాన్ని పంపిస్తామని తెలిపారు. కాగా ఈ ప్రకటన చేసి రెండు రోజులు అవుతుండగా డిన్నర్‌ ఆఫర్‌ తీసుకోవడానికి ఎవరూ ముందుకు రాకపోవడం గమనార్హం. ఇదిలా ఉంటే.. గడిచిన 24 గంటల్లో మధ్యప్రదేశ్‌లో 11,324 మంది కొవిడ్‌-19 బారిన పడ్డారు. 92 మంది మరణించారు.  


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని