అఖిల భారతీయ అఖాడ పరిషత్ అధిపతి నరేంద్రగిరి మహారాజ్‌ అనుమానస్పద మృతి

తాజా వార్తలు

Published : 20/09/2021 22:43 IST

అఖిల భారతీయ అఖాడ పరిషత్ అధిపతి నరేంద్రగిరి మహారాజ్‌ అనుమానస్పద మృతి

లఖ్‌నవూ: దేశంలోనే అతిపెద్ద ఆశ్రమాల్లో ఒకటైన అఖిల భారతీయ అఖాడ పరిషత్ అధిపతి మహంత్‌ నరేంద్రగిరి మహారాజ్‌ అనుమానాస్పద స్థితిలో మరణించారు. ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రయాగ్‌రాజ్‌లో ఉన్న బాఘంబరి మఠంలో నరేంద్రగిరి ఆయన పార్థివ దేహాన్ని స్వాధీనం చేసుకున్నట్లు యూపీ పోలీసులు వెల్లడించారు. ఓ సూసైడ్‌ నోట్‌ను కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ‘సూసైడ్‌ నోట్‌ను పరిశీలిస్తున్నాం. పలు కారణాలతో ఆయన మనస్తాపం చెందినట్లు లేఖలో రాశారు. ఆయన మృతి తర్వాత ఆశ్రమంలో చేపట్టాల్సిన కార్యాచరణను వివరించారు’ అని ప్రయాగ్‌రాజ్‌ పోలీస్‌ చీఫ్‌ కేపీ సింగ్‌ వెల్లడించారు.

నరేంద్రగిరి మహారాజ్‌ మరణం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ, ఉత్తర్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ సహా పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ‘అఖాడ పరిషత్‌ అధిపతి నరేంద్రగిరి మరణం ఎంతో బాధాకరం. ఆధ్యాత్మిక చింతనకు అంకితమైన ఆయన.. సంత్ సమాజంలోని ఆయా విభాగాలను ఒక్కతాటిపైకి తేవడంలో ప్రధాన పాత్ర పోషించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి. ఓం శాంతి’ అని ప్రధాని ట్వీట్‌ చేశారు.

‘అఖిల భారతీయ అఖాడ పరిషత్ అధిపతి నరేంద్రగిరి మరణం ఆధ్యాత్మిక ప్రపంచానికి తీరని లోటు. ఆ రాముడి పాదాలవద్ద ఆయనకు స్థానం లభించాలని, ఈ బాధను తట్టుకునే శక్తిని ఆయన అనుచరులకు ఇవ్వాలని రాముడిని ప్రార్థిస్తున్నా’ అంటూ యోగి ఆదిత్యనాథ్‌ ట్విటర్‌ ద్వారా సంతాపం వ్యక్తం చేశారు. వీరితోపాటు మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌, సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్‌ కూడా నివాళి అర్పించారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని