మహారాష్ట్రలో లాక్‌డౌన్‌ ఉండదు: ఉద్ధవ్‌

తాజా వార్తలు

Updated : 14/04/2021 09:46 IST

మహారాష్ట్రలో లాక్‌డౌన్‌ ఉండదు: ఉద్ధవ్‌

ముంబయి: మహారాష్ట్రలో లాక్‌డౌన్‌పై ఆ రాష్ట్ర సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే స్పష్టత ఇచ్చారు. రాష్ట్రంలో లాక్‌డౌన్ విధించడం లేదని చెప్పారు. ముంబయిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఉద్ధవ్‌ వివరించారు. కొవిడ్‌ తీవ్రత దృష్ట్యా రేపు రాత్రి 8 గంటల నుంచి లాక్‌డౌన్‌ తరహా ఆంక్షలుంటాయని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 15రోజుల పాటు 144 సెక్షన్‌ విధిస్తున్నట్లు సీఎం ప్రకటించారు.

ఆస్పత్రుల్లో ఆక్సిజన్‌ కొరత

‘‘మహారాష్ట్రలో కొవిడ్‌ వ్యాప్తి తీవ్రంగా ఉంది. ఆస్పత్రుల్లో పడకలు, ఆక్సిజన్‌ కొరత ఉంది. రెమిడెసివిర్‌ ఔషధానికి డిమాండ్‌ పెరుగుతోంది. రాష్ట్రంలో వైద్య సౌకర్యాలు క్రమంగా పెంచుతున్నాం. కొవిడ్‌ టీకాల సరఫరాను కేంద్రం మరింత పెంచాలి. తక్షణం ఆక్సిజన్‌ సరఫరా చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నా. మొత్తం ఆక్సిజన్‌ ఉత్పత్తిని వైద్య అవసరాలకే వాడాలి.

పేదలకు 3 కిలోల గోధుమలు.. ఆటో డ్రైవర్లకు ఆర్థిక సాయం

రేపటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా అన్ని రకాల ప్రభుత్వ, ప్రైవేట్‌ సంస్థలు, ప్రార్థనా మందిరాలు, థియేటర్లు, పార్కులు, జిమ్‌లు మూసివేస్తున్నాం. మే 1 వరకు దుకాణాలు, వాణిజ్య సంస్థలు మూసివేత ఉంటుంది. పేదలకు 3కిలోల గోధుమలు, 2కిలోల బియ్యం పంపిణీ చేస్తాం. ఆటో డ్రైవర్లు, వీధివ్యాపారులకు రూ.1,500 ఆర్థికసాయం అందిస్తాం

అత్యవసర సేవలకు మినహాయింపు

అత్యవసర సేవలకు మాత్రమే ఆంక్షల నుంచి మినహాయింపు ఉంటుంది. అవసరమైతేనే ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావాలి. అత్యవసర సేవలకే ప్రజారవాణా వాడాలి. అవసరం లేకుండా ప్రయాణాలు చేయొద్దు. అత్యవసర సేవలకే లోకల్‌ బస్సులు, రైళ్లు వినియోగించాలి. పెట్రోలు బంకులు, బ్యాంకింగ్‌ సంస్థలు పనిచేస్తాయి. హోటళ్లు, రెస్టారెంట్లలో పార్సిళ్లకు మాత్రమే అనుమతిస్తాం. రేపు ఉదయం 7 గంటల నుంచి విద్యాలయాలు, ప్రార్థనా మందిరాలు, సినిమా థియేటర్లు, పార్కులు, జిమ్‌లు  మూసివేస్తున్నాం. మే 1 వరకు దుకాణాలు, వాణిజ్య సంస్థలు పని చేయవు’’ అని ఉద్ధవ్‌ ఠాక్రే స్పష్టం చేశారు.


 Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని