corona కట్టడికి మహారాష్ట్ర కఠిన వ్యూహం! 

తాజా వార్తలు

Published : 25/05/2021 23:27 IST

corona కట్టడికి మహారాష్ట్ర కఠిన వ్యూహం! 

18 జిల్లాల్లో హోం ఐసోలేషన్‌ నిలిపివేయాలని నిర్ణయం

ముంబయి: రాష్ట్రంలో విలయతాండవం చేస్తున్న కరోనాకు చెక్‌ పెట్టేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం మరిన్ని కఠిన వ్యూహాలను అమలు చేయాలని నిర్ణయించింది. రాష్ట్రంలో పాజిటివ్‌ కేసులు పెరుగుతున్న జిల్లాల్లో హోం ఐసోలేషన్‌ను నిలిపివేస్తున్నట్టు రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి రాజేశ్‌ తోపె వెల్లడించారు. కరోనా రోగులంతా క్వారంటైన్‌ కేంద్రాల్లోనే ఉండేలా చర్యలు చేపట్టాలని నిర్ణయించినట్టు చెప్పారు. రాష్ట్ర సగటు పాజిటివ్‌ రేటు కన్నా అధికంగా ఉన్న 18 జిల్లాల్లో హోం క్వారంటైన్‌ను నిలిపివేసి.. ఆయా జిల్లాల్లో కొవిడ్‌ రోగులకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించేలా కొవిడ్‌ కేర్‌ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్టు మంత్రి తెలిపారు. 

మహారాష్ట్ర సహాయ, పునరావాస శాఖ మంత్రి విజయ్‌ వడెట్టివార్‌ మాట్లాడుతూ.. జూన్‌ 1 తర్వాత రెడ్‌ జోన్‌ కాని జిల్లాల్లో లాక్‌డౌన్‌ ఆంక్షలను సడలించాలని ప్రభుత్వం యోచిస్తోందని సోమవారం తెలిపారు. 15 జిల్లాలు ప్రస్తుతం రెడ్‌ జోన్‌లో ఉన్నాయని, అక్కడ కొవిడ్‌ ఆంక్షలు మరింత కఠినంగా అమలు చేయాలని నిర్ణయించినట్టు పేర్కొన్నారు. బుల్దానా, కొల్హాపూర్‌, రత్నగిరి, సంగ్లీ, యావత్మాల్‌, అమరావతి, సింద్‌దుర్గ్‌, సోలాపూర్‌, అకోలా, సతారా, వాషిమ్‌, బీద్‌, గడ్చిరోలి, అహ్మద్‌నగర్‌, ఉస్మానాబాద్‌ జిల్లాల్లో ఇప్పటికీ కొవిడ్‌ కేసులు పెరుగుతున్నాయని మంత్రి వెల్లడించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని