Covid: మమత బెనర్జీ సోదరుడి కన్నుమూత

తాజా వార్తలు

Published : 15/05/2021 14:55 IST

Covid: మమత బెనర్జీ సోదరుడి కన్నుమూత

కోల్‌కతా: పశ్చిమ బంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సోదరుడు ఆశిమ్‌ బెనర్జీ(60) కొవిడ్‌ సంబంధిత సమస్యలతో శనివారం ఉదయం మృతిచెందారు. ఇటీవలే కొవిడ్‌ బారిన పడిన ఆయనకు చికిత్స అందిస్తుండగానే ప్రాణాలు కోల్పోయినట్లు కోల్‌కతాలోని మెడికా సూపర్‌స్పెషాలిటీ ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. కొవిడ్‌ నిబంధనల ప్రకారం ఈ రోజు మధ్యాహ్నం అంత్యక్రియలు నిర్వహిస్తామని సంబంధిత వర్గాలు తెలిపాయి.

మరోవైపు బంగాల్‌లో కరోనా రోజువారీ కేసులు తీవ్ర స్థాయిలో నమోదవుతున్నాయి. దేశంలోని మొత్తం కేసుల్లో 79.7 శాతం 12 రాష్ట్రాల్లోనే ఉన్నాయి. అందులో పశ్చిమ బంగాల్‌ ఒకటి కావడం గమనార్హం. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన అక్కడి ప్రభుత్వం రెండు వారాల పాటు పూర్తిస్థాయి లాక్‌డౌన్ విధిస్తున్నట్లు ప్రకటించింది. రేపటి నుంచి లాక్‌డౌన్‌ అమల్లోకి రానుంది. నిత్యావసర సరకుల నిమిత్తం కొన్ని దుకాణాలను మాత్రం ఉదయం 7 గంటల నుంచి 10 గంటల వరకు తెరిచేందుకు అనుమతించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని