ఇకపై బంగారు ఆభరణాలకు హాల్‌మార్క్‌ తప్పనిసరి

తాజా వార్తలు

Published : 15/06/2021 21:31 IST

ఇకపై బంగారు ఆభరణాలకు హాల్‌మార్క్‌ తప్పనిసరి

దిల్లీ: బంగారు ఆభరణాలకు హాల్‌మార్క్‌ తప్పనిసరి చేసేందుకు కేంద్రం ఇచ్చిన గడువు ముగిసింది. దీంతో ఇక పై అన్ని బంగారు ఆభరణాలు, వస్తువులకు హాల్‌మార్క్‌ తప్పనిసరి అయింది. బంగారు ఆభరణాల స్వచ్ఛతను ధృవీకరించేందుకు హాల్‌మార్క్‌ను వినియోగిస్తారు. గతేడాది నవంబరులో ప్రభుత్వం అన్ని బంగారు ఆభరణాలకు హాల్‌మార్కును తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మొదట ఈ ఏడాది జనవరి 15 వరకు గడువు విధించారు. తర్వాత కరోనా కారణంగా జూన్‌ 1 వరకు పొడిగించారు. అనంతరం జూన్‌ 15 చివరి తేదీగా ప్రకటించారు.

వరల్డ్‌ గోల్డ్‌ కౌన్సిల్‌ నివేదిక ప్రకారం భారత్‌లో 4లక్షల మంది బంగారు వర్తకులు ఉన్నారు. వారిలో కేవలం 35 వేల మందినే బ్యూరో ఆఫ్ ఇండియన్‌ స్టాండర్డ్స్‌ (బీఐఎస్‌) ధృవీకరించింది. బీఐఎస్‌ ఏప్రిల్‌, 2000 నుంచి హాల్‌మార్క్‌ పథకాన్ని అందుబాటులోకి తెచ్చింది. బంగారం స్వచ్ఛత, వినియోగదారుల రక్షణ, ఆభరణాల విశ్వసనీయత కోసం ఈ విధానం అందుబాటులోకి తెచ్చారు. ఇది భారత్‌ను బంగారం మార్కెట్‌కు కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు కూడా ఉపయోగపడుతుంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని