కమాండో ఫొటో విడుదల చేసిన మావోయిస్టులు

తాజా వార్తలు

Updated : 07/04/2021 15:46 IST

కమాండో ఫొటో విడుదల చేసిన మావోయిస్టులు

రాయ్‌పూర్‌: ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన ఎదురుకాల్పుల్లో మావోయిస్టుల చేతిలో బందీగా మారిన కోబ్రా కమాండో రాకేశ్‌ మన్హాస్‌ ఫొటోను నక్సల్స్‌ విడుదల చేశారు. కాగా అతడు క్షేమంగానే ఉన్నట్లు తెలుస్తోంది. అడవిలో తాటాకులతో వేసిన చిన్న గుడిసెలో, కింద ప్లాస్టిక్‌ కవర్‌పై రాకేశ్‌సింగ్‌ కూర్చొని ఉన్న ఫొటోని విడుదల చేసింది. చర్చలకు మధ్యవర్తులను ప్రకటిస్తే జవాన్‌ను వదిలేస్తామని మంగళవారం నక్సల్స్‌ షరతు విధించారు. ఈ మేరకు మావోయిస్టు అధికార ప్రతినిధి వికల్ప్‌ పేరిట లేఖ విడుదల చేశారు. 

బీజాపూర్‌-సుకుమా జిల్లాల సరిహద్దు అటవీప్రాంతంలో ఈనెల 3వ తేదీ రాత్రి సైనికులకు, మావోయిస్టులకు మధ్య భీకర ఎదురుకాల్పులు జరిగాయి. పక్కా ప్రణాళిక రూపొందించి నక్సలైట్లు దాడికి తెగబడ్డారు. ఈ ఘటనలో 23 మంది సైనికులు మృతిచెందారు. మావోయిస్టుల్లోనూ భారీగానే ప్రాణనష్టం జరిగిందని పోలీసు వర్గాలు పేర్కొన్నాయి. అయితే కేవలం నలుగురు మాత్రమే ప్రాణాలు కోల్పోయినట్లు మావోయిస్టులు ప్రకటించారు. ఈ ఘటనలో కోబ్రా యూనిట్‌కు చెందిన రాకేశ్‌సింగ్‌ అనే కమాండో కనిపించకుండాపోయారు. అయితే ఆ జవాను తమ చెరలో ఉన్నట్లు నక్సలైట్లు పేర్కొన్నారు. సురక్షితంగానే ఉన్నట్లు వెల్లడించారు. కాగా తాజాగా రాకేశ్‌సింగ్‌ తమ చెరలోనే ఉన్నట్లు తెలిపే ఫొటోని విడుదల చేశారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని