Afghanistan: ఆత్మాహుతి దాడిలో మృతులకు సామూహిక అంత్యక్రియలు

తాజా వార్తలు

Published : 16/10/2021 23:31 IST

Afghanistan: ఆత్మాహుతి దాడిలో మృతులకు సామూహిక అంత్యక్రియలు

కాందహార్‌: అఫ్గానిస్థాన్ కాందహార్‌లోని షియా మసీదులో జరిగిన బాంబు పేలుళ్లలో మరణించిన వారికి సామూహిక అంత్యక్రియలు నిర్వహించారు. శుక్రవారం జరిగిన ఆత్మాహుతి దాడిలో 60 మందికిపైగా మృతి చెందగా వారందరిని ఒకేచోట మూకుమ్మడిగా సమాధి చేశారు. అనేక మంది ఒకేచోట చేరి సమాధులు సిద్ధం చేసి, మృతులకు అంత్యక్రియలు నిర్వహిస్తున్న ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది.

మసీదుపై దాడిలో మెుత్తం 63 మంది ప్రాణాలు కోల్పోయినట్లు షియా ముస్లిం పెద్ద హజీ ఫర్హాద్ తెలిపారు. మరికొందరు తీవ్ర గాయాలపాలై విషమ పరిస్థితులు ఎదుర్కొంటున్నట్లు పేర్కొన్నారు. మసీదులో జరిగిన ఆత్మాహుతి దాడి తామే చేసినట్లు ఉగ్రసంస్థ ఇస్లామిక్‌ స్టేట్‌ ఖొరాసన్‌ శుక్రవారం రాత్రి ప్రకటించింది. తమ గ్రూప్‌కు చెందిన ఇద్దరిలో ఒకరు మసీదు ద్వారం వద్ద, మరొకరు మసీదు లోపల ఆత్మాహుతి దాడి చేసినట్లు సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడించింది.



Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని