కూలిన మిగ్‌-21 యుద్ధవిమానం

తాజా వార్తలు

Updated : 05/01/2021 23:15 IST

కూలిన మిగ్‌-21 యుద్ధవిమానం

జైపుర్‌: రాజస్థాన్‌లోని సూరత్‌గఢ్‌లో ఎయిర్‌బేస్‌లో భారత వైమానిక దళానికి చెందిన మిగ్‌-21 బైసన్‌ యుద్ధ విమానం ప్రమాదానికి గురైంది. ల్యాండింగ్‌ సమయంలో తలెత్తిన సమస్యల కారణంగా మిగ్‌-21 కుప్పకూలిపోయినట్లు తెలుస్తోంది. అయితే ఈ ప్రమాదం నుంచి పైలట్‌ సురక్షితంగానే బయటపడ్డారు. ఎలాంటి ఆస్తి నష్టం కూడా జరగలేదు. విమానం కూలడంతో సమీప గ్రామ ప్రజలు వెంటనే అధికారులకు తెలియజేశారు. దీంతో వారు ఎయిర్‌బేస్‌కు చేరుకున్నారు. సాంకేతిక లోపం వల్లే విమానం కూలిపోయి ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని