మమతా దీదీకి శుభాకాంక్షలు: మోదీ

తాజా వార్తలు

Published : 03/05/2021 01:14 IST

మమతా దీదీకి శుభాకాంక్షలు: మోదీ

దిల్లీ: పశ్చిమబెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్‌ కాంగ్రెస్‌ విజయంపై ఆ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీకి ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు చెప్పారు. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేలా బంగాల్‌కు కేంద్రం నుంచి సాధ్యమైనంత మద్దతు కొనసాగిస్తామని హామీ ఇచ్చారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు. బెంగాల్‌ ప్రజలు కరోనాను జయించేందుకు సహకారమందిస్తామని తెలిపారు. ఈ ఎన్నికల్లో భాజపాను ఆదరించిన బెంగాల్‌ ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. బెంగాల్‌లో భాజపా గతంలో కన్నా పుంజుకుందని, క్షేత్రస్థాయిలో పని చేసిన  ప్రతి కార్యకర్తకు ధన్యవాదాలు తెలిపారు. 

మరోవైపు, నందిగ్రామ్‌ నుంచి బరిలో దిగిన మమతా బెనర్జీ ఓడిపోయినప్పటికీ.. ఆమె పార్టీ 200కు పైగా సీట్లు సాధించి పశ్చిమబెంగాల్‌లో వరుసగా మూడోసారి అధికార పీఠం దక్కించుకున్న విషయం తెలిసిందే.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని