Parliament: చర్చించరు..నడవనివ్వరు

తాజా వార్తలు

Updated : 27/07/2021 14:10 IST

Parliament: చర్చించరు..నడవనివ్వరు

పార్లమెంట్‌లో కాంగ్రెస్ వైఖరిపై మోదీ అసహనం

దిల్లీ: పార్లమెంట్‌ కార్యకలాపాలు సజావుగా సాగకుండా అడ్డుకుంటుందంటూ కాంగ్రెస్ పార్టీపై ప్రధాని నరేంద్ర మోదీ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం పార్లమెంటరీ పార్టీ సమావేశంలో భాగంగా కాంగ్రెస్ వైఖరిని ఆయన తప్పుపట్టారు. 

కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్‌లో చర్చకు ఆసక్తి చూపకపోగా..కార్యకలాపాలు సజావుగా సాగేందుకు సహకరించడం లేదని మోదీ విమర్శించారు. అలాగే టీకా కార్యక్రమంపై చర్చించేందుకు ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశానికి హాజరుకాలేదని దుయ్యబట్టారు. మరోవైపు ఆగస్టు 15 తర్వాత భాజపా ఎంపీలంతా తమ నియోజవర్గాలకు వెళ్లి ప్రజలకు వాస్తవాలను వివరించాలని మోదీ సూచించినట్లు సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. ఈ రోజు జరిగిన సమావేశంలో ప్రధానితో సహా, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి, ఇతర నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా పార్లమెంట్ సమావేశాలు నడుస్తోన్న తీరుపై ప్రధాని అసహనం వ్యక్తం చేశారు. 

పార్లమెంట్ వర్షాకాల సమావేశాల ప్రారంభానికి ముందు వెలుగులోకి వచ్చిన పెగాసస్ హ్యాకింగ్ వ్యవహారంతో ఉభయ సభలు దద్దరిల్లుతున్నాయి. పెగాసస్‌పై చర్చకు విపక్షాలు పట్టుబడుతున్నాయి. అలాగే గతేడాది కేంద్రం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలపై కూడా అదే వైఖరిని అనుసరిస్తున్నాయి. దాంతో పార్లమెంట్‌లో వాయిదాల పర్వం కొనసాగుతోంది. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని