Vaccination: రికార్డుకు అడుగు దూరంలో.. 99కోట్లు దాటిన డోసుల పంపిణీ

తాజా వార్తలు

Published : 19/10/2021 12:50 IST

Vaccination: రికార్డుకు అడుగు దూరంలో.. 99కోట్లు దాటిన డోసుల పంపిణీ

దిల్లీ: కరోనా మహమ్మారి కోరలను అణచివేసే వ్యాక్సినేషన్‌ కార్యక్రమంలో అరుదైన రికార్డుకు భారత్‌ అడుగు దూరంలో ఉంది. దేశంలో ఇప్పటివరకు 99కోట్లకు పైగా డోసులను పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ మంగళవారం వెల్లడించింది. ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ కూడా ట్విటర్‌లో ఈ విషయాన్ని పేర్కొన్నారు. ‘‘99కోట్లు దాటాం. టీకా పంపిణీలో 100కోట్ల డోసుల మైలురాయి దిశగా భారత్ వేగంగా కదులుతోంది’’ అని మంత్రి ట్వీట్ చేశారు.  

కరోనా వైరస్‌ను అరికట్టేందుకు బృహత్తర టీకా పంపిణీ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది జనవరి 16న ప్రారంభించింది. తొలినాళ్లలో డోసుల కొరత, ఇతరత్రా కారణాల వల్ల నెమ్మదిగా సాగిన వ్యాక్సినేషన్‌.. కరోనా రెండో దశ నుంచి ఊపందుకుంది. ఇటీవల సెప్టెంబరు 17న మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని ఒక్క రోజులోనే 2.5కోట్ల మందికి టీకాలు వేసి అరుదైన రికార్డు సృష్టించారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా టీకాల పంపిణీ 99కోట్లు దాటగా.. బుధవారానికి 100కోట్ల మైలురానికి చేరే అవకాశాలు కన్పిస్తున్నాయి. అదే జరిగితే చైనా తర్వాత 100కోట్ల డోసులు పంపిణీ చేసిన రెండో దేశంగా భారత్‌ అరుదైన గుర్తింపు సాధించనుంది.

ఉత్తరప్రదేశ్‌.. ఫస్ట్‌ 

ఇక టీకా పంపిణీలో ఉత్తరప్రదేశ్‌ అగ్రస్థానంలో ఉంది. ఆ రాష్ట్రంలో ఇప్పటివరకు 12కోట్లకు పైగా డోసులను పంపిణీ చేశారు. ఆ తర్వాత 9.21కోట్ల డోసుల పంపిణీతో మహారాష్ట్ర రెండో స్థానంలో నిలిచింది. పశ్చిమబెంగాల్‌, గుజరాత్‌, మధ్యప్రదేశ్‌, బిహార్‌, కర్ణాటక, రాజస్థాన్‌లలోనూ 6 కోట్లకు పైగా డోసులను పంపిణీ చేశారు.




Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని