సూర్యుడిపై భారీ విస్ఫోటనం

తాజా వార్తలు

Updated : 07/01/2021 00:23 IST

సూర్యుడిపై భారీ విస్ఫోటనం

భూమిని తాకనున్న శకలాలు

వాషింగ్టన్‌: జనవరి 2న సూర్యుడి దక్షిణార్ధ గోళంలో రెండు అయస్కాంత ఫిలమెంట్లు విస్ఫోటనం చెందినట్లు నాసా తెలిపింది. ఈ రెండు భారీ పేలుళ్లతో అనేక ఉద్గారాలు అంతరిక్షంలో వెలువడినట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. అయితే ఈ ఉద్గారాల్లో కొన్ని భూమిని ఢీ కొట్టొచ్చని అంతరిక్ష పరిశోధకులు భావిస్తున్నారు. దీని ప్రభావంతో భూమిపై రేడియో, అయస్కాంత తరంగాలు ఒడిదొడుకులకు లోనవనున్నట్లు పరిశోధకులు చెబుతున్నారు. సూర్యుడి కరోనా నుంచి ప్లాస్మా, అయస్కాంత తరంగాలు పేలడాన్నే కరోనిల్‌ మాస్‌ ఎజెక్షన్‌ (సీఎంఈ) అంటారు. ఈ రెండు సీఎంఈల బరువు బిలియన్‌ టన్నుల్లో ఉంటుంది. వీటిలో మొదటి సీఎంఈ నెమ్మదిగా ప్రయాణిస్తుండగా, రెండో సీఎంఈ సూర్యుడి నుంచి వేగంగా కదులుతోందని పరిశోధకులు చెబుతున్నారు. అయితే ఈ ఉద్గారాలకు అయస్కాంత శక్తి ఉంటుంది. అందువల్ల అవి మరింత బలంగా తమ ప్రభావాన్ని చూపవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అంతేకాకుండా ఈ ఉద్గారాలు సూర్యుడి నుంచి దూరం వెళ్లే కొలది పరిమాణంలో పెద్దవిగా మారతాయని పరిశోధకులు పేర్కొంటున్నారు. ఏదేమైనా ఈ సౌర పేలుళ్ల వల్ల అంతరిక్ష వాతావరణం ఒడిదొడుకులకు లోనుకావచ్చని నాసా వెల్లడించింది.

ఇవీ చదవండి..

భారత్‌లో కొత్త రకం కరోనా @ 73


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని