నాసా అంగారక విజయం..!

తాజా వార్తలు

Published : 19/02/2021 12:02 IST

నాసా అంగారక విజయం..!

వాషింగ్టన్‌: అమెరికా అంతరిక్ష సంస్థ నాసా ప్రయోగించిన రోవర్‌ ‘పర్సెవరెన్స్‌’ అంగారక గ్రహంపై విజయవంతంగా దిగింది. ఆపై ఆ గ్రహానికి చెందిన రెండు చిత్రాలను కూడా పంపటంతో నాసా శాస్త్రవేత్తల సంతోషం మిన్నంటింది. పర్సెవరెన్స్‌ గురువారం రాత్రి జీఎంటీ 20:55 సమయంలో (భారత కాలమానం ప్రకారం తెల్లవారు ఝామున 2:25 గంటలకు) ల్యాండ్‌ అయినట్టు నిర్ధారణ అయ్యింది.

అంగారకుడి ఈక్వేటర్‌కు (మధ్య రేఖ) సమీపంలో ఉన్న జెజెరో అనే లోతైన బిలం సమీపంలో నాసా రోవర్‌ ల్యాండ్‌ అయినట్టు వెల్లడైంది. ఆరు చక్రాలున్న పర్సెవరెన్స్‌, కనీసం రెండు సంవత్సరాల పాటు అంగారకుడిపైనే ఉండి పరిశోధనలు కొనసాగిస్తుంది. ఇందులో భాగంగా అక్కడ జీవం ఉందా అనే అంశాన్ని కనిపెట్టేందుకు.. అంగారకుడిపై ఉన్న రాళ్లు, ఉపరితలాన్ని తొలిచి లభించిన మట్టి తదితరాలను విశ్లేషిస్తుందని నాసా శాస్త్రవేత్తలు వివరించారు. కాగా, బిలియన్ల సంవత్సరాల క్రితం జెజెరో ప్రాంతంలో ఓ సరోవరం ఉండి ఉంటుందని వారు భావిస్తున్నారు. నీరు ఉన్న నేపథ్యంలో జీవం కూడా ఉండి ఉండే అవకాశం లేకపోలేదని అంటున్నారు.

ల్యాండ్‌ ఐన అనంతరం పర్సెవరెన్స్‌, తక్కువ రిసోల్యూషన్‌ కలిగిన ఇంజినీరింగ్‌  కెమేరాల సాయంతో అంగారకుడి ఫొటోలు తీసింది. కాగా రోవర్‌కు ముందు, వెనుక కూడా ఎత్తుపల్లాలు లేకుండా సమాంతరంగా ఉన్నట్టు ఈ చిత్రాల ద్వారా వెల్లడైంది. ఈ ఘన విజయంతో కాలిఫోర్నియాలో మిషన్‌ను పర్యవేక్షిస్తున్న నాసా ఇంజినీర్ల ఆనందం పెల్లుబికింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని