సాగు చట్టాలతో ఆదాయం పెరుగుతుంది, కానీ..

తాజా వార్తలు

Updated : 28/01/2021 04:31 IST

సాగు చట్టాలతో ఆదాయం పెరుగుతుంది, కానీ..

ఐఎంఎఫ్‌ ప్రధాన ఆర్థికవేత్త గీతా గోపీనాథ్‌ కీలక వ్యాఖ్యలు

వాషింగ్టన్‌: కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన సాగు చట్టాలపై అంతర్జాతీయ ద్రవ్య నిధి(ఐఎంఎఫ్‌) సంస్థ ప్రధాన ఆర్థికవేత్త గీతా గోపినాథ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. కొత్త చట్టాల వల్ల రైతుల ఆదాయం పెరిగే అవకాశం ఉందని తెలిపారు. అయితే, వీటి వల్ల ప్రభావితమయ్యే రైతులకు సామాజిక రక్షణలు కల్పించాలని సూచించారు. భారత వ్యవసాయ రంగంలో ఇంకా అనేక సంస్కరణలు చేపట్టాల్సిన అవసరం ఉందని ఆమె అభిప్రాయపడ్డారు.

కొత్త వ్యవసాయ చట్టాలు ప్రధానంగా మార్కెటింగ్‌ ఆధారంగా రూపొందించారని గోపీనాథ్‌ తెలిపారు. వీటి వల్ల కొత్త మార్కెట్లలో ఉన్న అవకాశాల్ని ఒడిసిపట్టుకునే వెసులుబాటు కలుగుతుందన్నారు. మండీలతో పాటు ఇతర కొనుగోలు కేంద్రాలు అందుబాటులోకి వస్తాయన్నారు. ఎలాంటి పన్ను చెల్లించే అవసరం లేకుండా రైతులు తమ ఉత్పత్తులను అమ్ముకునే అవకాశం చట్టాలు కల్పిస్తున్నాయన్నారు. దీనివల్ల అన్నదాతల ఆదాయం తప్పకుండా పెరుగుతుందన్నారు. అయితే, కొత్త సంస్కరణలు తీసుకొచ్చినప్పుడు కొన్ని ఇబ్బందులు ఎదురవుతుంటాయని ఆమె అభిప్రాయపడ్డారు. వాటివల్ల ప్రభావితమయ్యే వారికి భద్రత కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తుతం భారత్‌లో దీనిపైనే చర్చ జరుగుతోందన్నారు.

కొత్త సాగు చట్టాలను రద్దు చేయాలంటూ దిల్లీ సరిహద్దుల్లో దాదాపు రెండు నెలలుగా రైతులు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. ఈ విషయంపై రైతు సంఘాలు, కేంద్రం మధ్య 11 విడతలు చర్చలు జరిగాయి. అయినా ఎలాంటి ఫలితం తేలలేదు. ఈ క్రమంలో రెండు సంవత్సరాల వరకు చట్టాల అమలును నిలిపివేస్తామని.. ఈలోగా సమస్యల పరిష్కారానికి కృషి చేద్దామని కేంద్రం ప్రతిపాదించింది. కానీ, రైతులు మాత్రం చట్టాల రద్దు డిమాండ్‌ నుంచి దిగిరావడం లేదు. ఈ క్రమంలో మంగళవారం గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు ట్రాక్టర్‌ ర్యాలీ కూడా నిర్వహించారు.

ఇవీ చదవండి...

ఎర్రకోట ఘటనపై హోంశాఖ సీరియస్‌

ఎర్రకోటపై రైతు జెండా!


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని