వచ్చే ఏడాది జాతీయ విద్యా విధానం అమలు

తాజా వార్తలు

Published : 25/05/2021 23:51 IST

వచ్చే ఏడాది జాతీయ విద్యా విధానం అమలు

దిల్లీ: కేంద్ర ప్రభుత్వ నిధులతో నడిచే సంస్థల్లో రాబోయే విద్యా సంవత్సరం నుంచి నూతన విద్యా విధానాన్ని అమలు చేస్తామని విద్యాశాఖ ప్రకటించింది. ‘‘ఫాస్ట్‌ ట్రాక్‌పై జాతీయ విద్యా విధానం జూన్‌, 2021 నుంచి దేశవ్యాప్తంగా ప్రారంభం అవుతుంది’’ అని కేంద్ర మానవ వనరుల మంత్రి రమేష్‌ పోఖ్రియాల్ ట్వీట్‌ చేశారు. నూతన విద్యావిధానానికి సంబంధించి 181 అభివృద్ధి చేయాల్సిన పనులు గుర్తించామని తెలిపారు. మొదటిగా అండర్‌ గ్రాడ్యుయేట్‌, పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ ప్రోగ్రామ్‌లో మల్టీడిసిప్లినరీ కోర్సులు, యూనివర్సిటీలలో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ కోర్సులలో ప్రవేశం, క్రెడిట్‌ బ్యాంక్‌ వ్యవస్థను ప్రారంభించనున్నారు. జాతీయ విద్యా విధానాన్ని రాష్ట్ర స్థాయిలో అమలు చేయడానికి కాస్త ఆలస్యం అయ్యే అవకాశం ఉందని తెలిపారు. దేశవ్యాప్తంగా కేంద్ర విశ్వవిద్యాలయాలు మొదటి సంవత్సరంలో ప్రభుత్వ ఆదేశాలను అనుసరించనున్నాయి. కాగా కేంద్రం జాతీయ విద్యావిధానాన్ని గతేడాది జులైలో ఆమోదించింది.  స్వాతంత్య్రానంతరం దేశంలో ఇది మూడో విద్యా విధానం. 2030 నాటికి అందరికీ విద్య అందించడమే లక్ష్యంగా దీన్ని కేంద్రం ప్రవేశ పెట్టింది. నూతన విద్యా విధానంలోని అంశాలు..

* 3 నుంచి 18 ఏళ్ల వరకు అందరికీ విద్య తప్పనిసరి

* 6వ తరగతి నుంచి కోడింగ్, ప్రోగ్రామింగ్ కరిక్యులమ్

* 6వ తరగతి నుంచి వొకేషనల్ ఇంటిగ్రేషన్ కోర్సులు

* ఎంఫిల్‌ కోర్సు పూర్తిగా తొలగింపు

* ప్రస్తుతం 10+2+3 (టెన్త్, ఇంటర్, డిగ్రీ) విద్యా విధానం స్థానంలో ఇక నుంచి 5+3+3+4 విద్యా విధానం. డిగ్రీ విద్య మూడు నుంచి నాలుగేళ్లకు పొడిగింపు. పీజీ విద్య ఏడాది లేదా రెండేళ్లు. ఇంటర్ విద్య ఉండదు. ఇంటిగ్రేటెడ్ పీజీ, యూజీ విద్య ఐదేళ్లు

* దేశవ్యాప్తంగా ప్రాథమిక విద్యకు ఒకటే సిలబస్‌

* పాఠ్యాంశాల భారం తగ్గించేలా కాన్సెప్ట్‌ నేర్పే ప్రయత్నం

* కస్తుర్బా గాంధీ బాలిక విద్యాలయాలు ఇక నుంచి 12వ తరగతి వరకు మాత్రమే

* రీసెర్చ్ ఇంటెన్సివ్ లేదా టీచింగ్ ఇంటెన్సివ్ యూనివర్సిటీలు, అటానమస్ డిగ్రీ గ్రాంటింగ్ కాలేజీలు, మోడల్ మల్టీ డిసిప్లినరీ ఎడ్యుకేషన్, రీసెర్చ్ యూనివర్సిటీలకు ఆమోదం


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని