పేలుడు పదార్థాల కేసు: మరో అధికారి అరెస్టు

తాజా వార్తలు

Published : 23/04/2021 23:36 IST

పేలుడు పదార్థాల కేసు: మరో అధికారి అరెస్టు

ముంబయి: రిలయన్స్‌ అధినేత ముకేశ్‌ అంబానీ నివాసమైన ఆంటిలా సమీపంలో పేలుడు పదార్థాలతో కూడిన వాహనం కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) అధికారులు మరో పోలీసు అధికారిని అరెస్టు చేశారు. ముంబయి నేర విభాగం ఇన్‌స్పెక్టర్‌ సునీల్‌ మానేను అరెస్టు చేసినట్లు ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ కేసులో ఇప్పటివరకూ ముగ్గురు పోలీసు అధికారులు అరెస్టయ్యారు. మార్చి 13న సచిన్‌ వాజేను, ఆ తర్వాత ఈనెల 12న మరో పోలీసు అధికారి రిజాజుద్దీన్‌ ఖాజీని ఎన్‌ఐఏ అదుపులోకి తీసుకుంది. ఈ కేసులో ఇద్దరు పోలీసు అధికారులు సచిన్‌ వాజేకు సహకరించినట్లు దర్యాప్తు అధికారులు అనుమానిస్తున్నారు.

గత మార్చి నెలలో భారత వ్యాపార దిగ్గజం ముకేశ్‌ అంబానీ ఇంటి సమీపంలో ఓ కారులో పేలుడు పదార్థాలు లభించడం సంచలనంగా మారింది. అప్పటి నుంచి ఈ కేసు అనేక మలుపులు తిరుగుతోంది. పోలీసులు వాహనాన్ని గుర్తించిన కొద్ది రోజులకే ఆ వాహన యజమాని మన్‌సుఖ్‌ హిరెన్‌ ఓ వాగులో శవమై దొరకడం కలకలం రేపింది. కొద్దిరోజుల అనంతరం పేలుడు పదార్థాల కేసు దర్యాప్తును జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) చేపట్టి సంచలన విషయాలను వెలుగులోకి తెచ్చింది. అప్పటివరకు ఆ కేసు దర్యాప్తు చేసిన పోలీసు అధికారి సచిన్‌ వాజేనే ఆ వాహనాన్ని ముకేశ్‌ అంబానీ ఇంటివద్ద నిలిపినట్లు ధ్రువీకరించారు. అతడిని అరెస్టు చేసి విచారిస్తున్నారు. వాజేకు సహకరించిన ఇద్దరు పోలీసును గతంలో అరెస్టు చేయగా తాజాగా మరో పోలీసు అధికారిని అదుపులోకి తీసుకున్నారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని