ఉగ్రదాడులకు కుట్ర.. ఎన్‌ఐఏ సోదాలు

తాజా వార్తలు

Published : 15/03/2021 17:45 IST

ఉగ్రదాడులకు కుట్ర.. ఎన్‌ఐఏ సోదాలు

దిల్లీ : దేశంలో దాడులు జరిపి విధ్వంసం సృష్టించేందుకు ఐసిస్‌ ఉగ్రవాదులు కుట్రలు పన్నుతున్నారనే సమాచారంతో జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) అప్రమత్తమైంది. సోమవారం దేశరాజధాని దిల్లీ సహా పలు ప్రాంతాల్లో సోదాలు జరిపింది. దిల్లీ, కర్ణాటక, కేరళలోని 10 ప్రాంతాల్లో అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ కుట్రకు సంబంధించి పాక్‌, ఐసిస్‌ ముఠాలతో సంబంధమున్నట్లు అనుమానిస్తున్న ఐదుగురిని అరెస్టు చేసినట్లు సమాచారం. 

ఉగ్రవాద సంబంధాలపై ఇటీవల కొందరు మహిళలను ఐన్‌ఐఏ అధికారులు అదుపులోకి తీసుకోగా.. వారిచ్చిన సమాచారం మేరకు ఈ దాడులు చేపట్టింది. సోషల్‌మీడియా వేదికల్లో స్థానిక యువతను ఆకర్షించి, వారికి ఆన్‌లైన్‌లోనే శిక్షణ ఇస్తున్నట్లు ఎన్‌ఐఏకు సమాచారం అందింది. వీరి ద్వారా దేశంలో పలు చోట్ల పేలుళ్లు జరిపేందుకు కుట్ర జరుగుతున్నట్లు ఎన్‌ఐఏ వర్గాలు వెల్లడించాయి. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని