నిఘా వైఫల్యం లేదు.. 25-30 మంది నక్సలైట్ల హతం
close

తాజా వార్తలు

Published : 05/04/2021 10:20 IST

నిఘా వైఫల్యం లేదు.. 25-30 మంది నక్సలైట్ల హతం

వెల్లడించిన సీఆర్పీఎఫ్‌ డీజీ కుల్దీప్‌సింగ్‌

రాయ్‌పూర్‌: ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌ అడవుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌ ఘటనలో నిఘా వ్యవస్థ వైఫల్యం ఏమాత్రం లేదని సీఆర్పీఎఫ్‌ డైరెక్టర్‌ జనరల్‌ కుల్దీప్‌సింగ్‌ స్పష్టం చేశారు. ఎదురుకాల్పుల ఘటనను పర్యవేక్షిస్తున్న ఆయన మావోయిస్టులపై దాడులకు రచించిన కార్యాచరణలోనూ లోపాలు లేవని వెల్లడించారు. ఏదైనా సమస్యను ముందుగా గుర్తిస్తే బలగాలు కూంబింగ్‌కు వెళ్లే పరిస్థితే ఉండదన్న కుల్దీప్‌సింగ్‌.. ఆపరేషన్‌లో వైఫల్యం ఉంటే ఎక్కువ మంది నక్సలైట్లు మరణించేవారేకాదని పేర్కొన్నారు.

బలగాల కాల్పుల్లో గాయపడిన, మృతిచెందిన వారిని మావోయిస్టులు మూడు ట్రాక్టర్లలో తరలించినట్లు సమాచారం అందిందని డీజీ తెలిపారు. కాగా ఈ ఆపరేషన్‌లో ఎంతమంది నక్సలైట్లు మృతిచెందారన్నదానిపై ఇప్పుడే స్పష్టత ఇవ్వలేమన్న కుల్దీప్‌సింగ్‌.. సుమారు 25 నుంచి 30 మంది మావోయిస్టులు చనిపోయి ఉంటారని అంచనా వేశారు. ఎదురుకాల్పుల్లో గాయాలపాలైన జవాన్లను ఈరోజు కలవనున్నట్లు ఆయన వెల్లడించారు.

జీజాపూర్‌-సుకుమా జిల్లాల సరిహద్దులోని అటవీ ప్రాంతంలో శనివారం సైనికులు, మావోల మధ్య భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. పక్కా ప్రణాళికతో మావోలు ఈ దాడికి పాల్పడ్డట్లు తెలుస్తోంది. ఈ భీకర పోరులో మృతిచెందిన సైనికుల సంఖ్య 22కి చేరింది. మొత్తం 30 మంది జవాన్లు గాయపడగా వారిని హెలికాప్టర్ల ద్వారా ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా వారిలో పలువురి ఆరోగ్యం ఆందోళనకరంగా ఉన్నట్లు సమాచారం.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని