ఉభయ కొరియాల బలప్రదర్శన.. పోటాపోటీగా క్షిపణుల ప్రయోగం!

తాజా వార్తలు

Updated : 15/09/2021 19:43 IST

ఉభయ కొరియాల బలప్రదర్శన.. పోటాపోటీగా క్షిపణుల ప్రయోగం!

సియోల్‌: ఉత్తర, దక్షిణ కొరియా దేశాల మధ్య మరోసారి ఘర్షణ వాతావరణం నెలకొంది. రెండు దేశాలు కొన్ని గంటల వ్యవధిలోనే పోటాపోటీగా క్షిపణులు ప్రయోగించడం ఇందుకు బలం చేకూరుస్తోంది. తొలుత ఉత్తర కొరియా క్షిపణులు ప్రయోగించగా.. దానికి పోటీగా దక్షిణ కొరియా కూడా బలప్రదర్శనకు దిగింది. 

గత కొన్ని నెలలుగా ప్రశాంతంగా ఉన్న ఉత్తర కొరియా ఇటీవల మళ్లీ క్షిపణి పరీక్షలను మొదలుపెట్టింది. కొత్తగా అభివృద్ధి చేసిన దీర్ఘశ్రేణి క్రూయిజ్‌ క్షిపణులను విజయవంతంగా పరీక్షించినట్లు సోమవారం ప్రకటించింది. దానికి కొనసాగింపుగా బుధవారం సైతం మరో రెండు క్షిపణులను భారత కాలమానం ప్రకారం ఉదయం 6 గంటలకు ప్రయోగించింది. అవి దక్షిణ కొరియా మీదుగా జపాన్‌కు చెందిన ఎకనమిక్‌ జోన్‌లో పడినట్లు దక్షిణ కొరియా ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. 60 కిలోమీటర్ల ఎత్తులో.. 800 కిలోమీటర్లు దూరం ప్రయాణించినట్లు తెలిపారు. 

అక్కడికి కొద్ది గంటలకు సబ్‌మెరైన్‌ నుంచి బాలిస్టిక్‌ క్షిపణిని ప్రయోగించిన దక్షిణ కొరియా కూడా ప్రకటించింది. ఈ క్షిపణి బాహ్య దాడులను నుంచి దేశాన్ని రక్షించుకోవడానికి, కొరియా ద్వీపకల్పంలో శాంతిని పరిరక్షణకు ఉపయోగపడుతుందని దక్షిణ కొరియా ప్రకటించింది.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని