అమెరికాను రెచ్చగొట్టే చర్యలు: క్షిపణుల ప్రయోగం

తాజా వార్తలు

Published : 26/03/2021 14:10 IST

అమెరికాను రెచ్చగొట్టే చర్యలు: క్షిపణుల ప్రయోగం

ప్యాంగాంగ్‌: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ హెచ్చరికల నేపథ్యంలో రెచ్చగొట్టే చర్యలకు పదునుపెట్టింది ఉత్తర కొరియా. మరోసారి క్షిపణి ప్రయోగం చేపట్టినట్లు ఆ దేశం ప్రకటించింది. అమెరికా, ఉత్తర కొరియా మధ్య చర్చలు నిలిచిపోయిన నేపథ్యంలో ఉద్రిక్తతలు పెంచే చర్యలు చేపడితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని బైడెన్‌ ఇటీవల హెచ్చరించారు. ఇలాంటి పరిస్థితుల్లోనే ఉత్తర కొరియా రెండు కొత్త తరం గైడెడ్‌ క్షిపణులను ప్రయోగించింది. గురువారం అవి లక్ష్యాన్ని ఛేదించినట్లు ఆ దేశ అధికారిక మీడియా సెంట్రల్‌ న్యూస్‌ ఏజెన్సీ ప్రకటించింది. కొరియా ద్వీపకల్పంలో సైనిక బెదిరింపులను ఎదుర్కొనేలా ఆయుధ సంపత్తిని పెంచుకునేందుకు ఈ ప్రయోగం చేపట్టినట్లు వెల్లడించింది.

ఐరాస భద్రతా మండలి తీర్మానాల్లో నిషేధించిన ఖండాంతర క్షిపణులను ఉత్తర కొరియా ప్రయోగించినట్లు జపాన్‌ తెలిపింది. బైడెన్‌ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత ఉత్తరకొరియా చేపట్టిన మొదటి రెచ్చగొట్టే చర్య ఇదేనని నిపుణులు పేర్కొంటున్నారు. భవిష్యత్తులో జరపబోయే చర్చల్లో తన పరపతి పెంచుకునే విధంగా బైడెన్‌ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకే ఉత్తర కొరియా ఈ చర్యలు చేపడుతోందని అభిప్రాయపడుతున్నారు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని