కరోనాతో మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు రూ.15లక్షలు 

తాజా వార్తలు

Published : 24/07/2021 23:43 IST

కరోనాతో మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు రూ.15లక్షలు 

ప్రకటించిన ఒడిశా ప్రభుత్వం

భువనేశ్వర్‌: కరోనా వేళ ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌గా నిలిచి..  వైరస్‌ బారిన పడి మరణించిన జర్నలిస్టులకు ఒడిశా ప్రభుత్వం అండగా నిలిచింది. ఈమేరకు విడుదల చేసిన ఓ ప్రకటనలో.. ‘‘కొవిడ్‌ బారిన పడి చనిపోయిన 17 మంది జర్నలిస్టులకు రూ.2.25 కోట్లు ప్రభుత్వం తరఫు నుంచి సాయంగా అందనుంది. గతంలో సమాచార, పౌర సంబంధాల శాఖ జర్నలిస్టులను ఆదుకోవాలని తీసుకొచ్చిన ప్రతిపాదనకు శుక్రవారం ఆ రాష్ర్ట ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ ఆమోదం తెలిపారు’’ అని ప్రకటించింది. ఈమేరకు ఒక్కో జర్నలిస్టు కుటుంబానికి రూ.15 లక్షలు.. జర్నలిస్ట్‌ వెల్‌ఫేర్‌ ఫండ్‌ తరఫు నుంచి అందనుంది. టీవీ, పత్రికా రంగానికి చెందిన జర్నలిస్టులే కాకుండా ఫ్రీలాన్సర్లుగా పనిచేసే వారికి ఈ ఫండ్‌ అందించనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని