బెంగాల్‌లో కలకలం.. 200 శునకాల దుర్మరణం

తాజా వార్తలు

Published : 21/02/2021 01:16 IST

బెంగాల్‌లో కలకలం.. 200 శునకాల దుర్మరణం

కోల్‌కతా: బెంగాల్‌లో శునకాల అనుమానాస్పద మృతి కలకలం సృష్టిస్తోంది. బెంగాల్‌లోని బంకురా జిల్లా బిష్ణుపూర్‌ పట్టణంలో మూడు రోజుల వ్యవధిలో 200లకు పైగా వీధి శునకాలు మృత్యువాత పడ్డాయి. మంగళవారం నాడు 60, బుధవారం ఏకంగా 97 , గురువారం రోజున 45 శునకాలు మృతిచెందినట్లు స్థానిక అధికారులు వెల్లడించారు. ఈ విషయాన్ని జిల్లా అధికారులకు తెలియజేసినట్లు వారు పేర్కొన్నారు. కాగా మృతిచెందిన శునకాల నుంచి నమూనాలు సేకరించిన వెటర్నరీ సిబ్బంది పరీక్షల నిమిత్తం వాటిని కోల్‌కతా పంపించారు. అయితే పెద్ద ఎత్తున కుక్కల మృతికి వైరల్‌ ఇన్‌ఫెక్షన్‌ కారణమని వైద్య సిబ్బంది అనుమానిస్తున్నారు.
 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని