40 కోట్ల మార్కును దాటిన వ్యాక్సినేషన్‌

తాజా వార్తలు

Published : 18/07/2021 10:09 IST

40 కోట్ల మార్కును దాటిన వ్యాక్సినేషన్‌

స్వల్పంగా పెరిగిన కొత్త కేసులు

ఇంటర్నెట్‌డెస్క్‌: భారత్‌ వ్యాక్సినేషన్‌లో మరో కీలక మైలురాయిని దాటింది. శనివారం ఇచ్చిన 46.38 లక్షల డోసులతో కలిపి దేశంలో టీకాల పంపిణీ 40 కోట్ల మైలురాయిని దాటింది. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. శనివారం 21,18,682 మంది తొలిడోసు స్వీకరించగా.. 2,33,019 మంది రెండో డోసు తీసుకొన్నారు. దీంతో 40.49 కోట్ల డోసుల టీకాలు ఇచ్చినట్లైంది. ఇక కొవిడ్‌ సోకిన వ్యక్తికి క్షయ (టీబీ) సోకే అవకాశలు పెరిగిపోతాయని అధికారులు వెల్లడించారు. కాకపోతే, క్షయ సోకిన కేసులు తక్కువగానే ఉన్నాయని చెప్పారు. 2020 నుంచి కొవిడ్‌ నిబంధనల అమల్లో ఉండటంతో దేశంలో టీబీ కూడా తగ్గుముఖం పట్టినట్లు అధికారులు పేర్కొన్నారు. 

దేశంలో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. శనివారం మొత్తం 19,36,709 పరీక్షలు నిర్వహించగా 41,157 మందికి పాజిటివ్‌ వచ్చింది. 518 మంది మరణించారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 4,13,609కి పెరిగింది. ఇక 42,004 మంది వైరస్‌ నుంచి కోలుకొన్నారు. మొత్తం కోలుకొన్న వారి సంఖ్య 3,02,69,796కు చేరింది. రికవరీ రేటు మెరుగై 97.31శాతంగా ఉంది. ప్రస్తుతం దేశంలో 4,22,660 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని