Pegasus: పెగాసస్‌ వ్యవహారంపై ‘సుప్రీం’ విచారణ 13కు వాయిదా

తాజా వార్తలు

Published : 07/09/2021 23:40 IST

Pegasus: పెగాసస్‌ వ్యవహారంపై ‘సుప్రీం’ విచారణ 13కు వాయిదా

దిల్లీ: పెగాసస్ వ్యవహారంలో స్వతంత్ర దర్యాప్తు జరిపించాలన్న పిటిషన్లపై కౌంటర్ దాఖలు చేసేందుకు కేంద్రానికి సుప్రీంకోర్టు మరింత సమయం ఇచ్చింది. దేశ భద్రతకు విఘాతం కలిగించే ఏ విషయాన్నీ వెల్లడించరాదని  సీజేఐ జస్టిస్ ఎన్‌వీ రమణ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం కేంద్రానికి సూచించింది. కేంద్రం తరఫున వాదనలు వినిపించిన సొలిసిటర్  జనరల్ తుషార్ మెహతా.. పలు కారణాల వల్ల అఫిడవిట్ దాఖలు చేయలేకపోతున్నామన్నారు. అందువల్ల విచారణను ఈ నెల 9 లేదా 13 తేదీకి వాయిదా వేయాలని ధర్మాసనాన్ని కోరారు. అందుకు అంగీకరించిన సుప్రీంకోర్టు ఈ విచారణను ఈ నెల 13కు వాయిదా వేసింది. పెగాసస్ అంశంపై స్వతంత్ర దర్యాప్తు కోరుతూ ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా దాఖలు చేసిన పిటిషన్ సహా పన్నెండింటిని సుప్రీం ధర్మాసనం విచారణ చేస్తోంది. ఇజ్రాయెల్‌కు చెందిన  స్పైవేర్ పెగాసస్‌ని ఉపయోగించి దేశంలోని 300 మందికి పైగా ప్రముఖుల ఫోన్ నంబర్లు హ్యాకింగ్‌కు పాల్పడినట్టు అంతర్జాతీయ మీడియా పేర్కొనడం పెను రాజకీయ దుమారానికి కారణమైన విషయం తెలిసిందే.



Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని