Kerala: సీఎంగా విజయన్‌ రెండోసారి ప్రమాణం

తాజా వార్తలు

Updated : 20/05/2021 16:48 IST

Kerala: సీఎంగా విజయన్‌ రెండోసారి ప్రమాణం

తిరువనంతపురం: కేరళ ముఖ్యమంత్రిగా పినరయి విజయన్‌ ప్రమాణ స్వీకారం చేశారు. తిరువనంతపురంలోని సెంట్రల్‌ స్టేడియంలో జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమం కొవిడ్‌ నిబంధనల మధ్య కొనసాగింది. ఈ సందర్భంగా ట్విటర్‌లో స్పందించిన విజయన్‌.. ప్రజల ఆశయాలకు అనుగుణంగా నవ కేరళను నిర్మించేందుకు కలసి కట్టుగా కృషి చేద్దామని పిలుపినిచ్చారు.ఇటీవలే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పినరయి విజయన్‌ నేతృత్వంలోని ఎల్డీఎఫ్‌కే కేరళ ప్రజలు పట్టంకట్టిన విషయం తెలిసిందే.

ఇక 11 మందితో నూతన మంత్రివర్గాన్ని సీఎం పినరయి విజయన్‌ ఇప్పటికే వెల్లడించారు. అయితే గత ప్రభుత్వంలోని ఒక్కరికీ ఈసారి కేబినెట్‌లో అవకాశం కల్పించలేదు. అందర్నీ కొత్తవారినే తీసుకున్నారు. శాసనసభ స్పీకర్‌గా ఎం.బి.రాజేశ్‌, మంత్రులుగా ఎం.వి.గోవిందన్‌, కె.రాధాకృష్ణన్‌, కె.ఎన్‌.బాలగోపాల్‌, పి.రాజీవ్‌, వి.ఎన్‌.వాసన్‌, సౌజీ చెరియన్‌, శివన్‌కుట్టి, మహ్మద్‌ రియాజ్‌, డాక్టర్‌ ఆర్‌.బిందు, వీణా జార్జి, వి. అబ్దుల్‌ రెహ్మాన్‌ ఉన్నారు.

ఇదిలాఉంటే, కేరళలో మొత్తం 140 అసెంబ్లీ స్థానాలకుగానూ అధికార ఎల్‌డీఎఫ్‌ 99 స్థానాల్లో విజయం సాధించి వరుసగా రెండోసారి అధికారాన్ని చేపట్టింది. కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూడీఎఫ్‌ 41 స్థానాలకు పరిమితమైంది. భాజపా మాత్రం బోణీ కొట్టలేకపోయింది. ఉన్న ఒక్కస్థానాన్నీ కోల్పోయింది.

పార్టీ ప్రయోజనాల కోసమే: ఏచూరి
కేరళ నూతన మంత్రివర్గం నుంచి మాజీ ఆరోగ్యమంత్రి కేకే శైలజను తప్పించడంపై సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి స్పందించారు. పార్టీ ప్రయోజనాలతో పాటు కొత్తవాళ్లకు చోటివ్వాలన్న ఉద్దేశంతో నూతన మంత్రివర్గ కూర్పు చేపట్టినట్లు చెప్పారు. విజయన్‌ ప్రమాణస్వీకార కార్యక్రమానికి వచ్చిన సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. కొత్త వాళ్లకు అవకాశం ఇవ్వాలన్న ఉద్దేశంతో 26 సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు, సీనియర్‌ మంత్రులకు సైతం టికెట్‌ కేటాయించలేదన్న విషయాన్ని గుర్తుచేశారు. మంత్రుల ఎంపిక పార్టీ రాష్ట్ర కమిటీ నిర్ణయమని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని