విందామా..! నవ వసంతానికి మోదీ కవిత

తాజా వార్తలు

Updated : 01/01/2021 13:26 IST

విందామా..! నవ వసంతానికి మోదీ కవిత

దిల్లీ: కాలగమనంలో మరో ఏడాది వచ్చేసింది. 2020లో కరోనా మిగిల్చిన చేదు జ్ఞాపకాలు చెరిగి పోయి.. కొత్త సంవత్సరంలోనైనా మంచి రోజులు రావాలని కోరుకుంటూ యావత్‌ ప్రపంచం నవ వసంతాన్ని ఆహ్వానించింది. ఈ సందర్భంగా మన ప్రధానమంత్రి నరేంద్రమోదీ నూతన సంవత్సరాన్ని స్వాగతిస్తూ ఓ కవిత రాశారు. ఎన్నో కష్టాలు, ఇబ్బందులు దాటుకుని వచ్చిన మనం.. విజయమనే వెలుతురును చేరుకుంటున్నామంటూ తన మాటలతో ప్రజల్లో ఉత్సాహాన్ని నింపే ప్రయత్నం చేశారు.

‘అభీ తో సూరజ్‌ ఉగా హై(సూర్యుడు ఇప్పుడిప్పుడే ఉదయిస్తున్నాడు)’ టైటిల్‌తో రాసిన ఈ కవిత వీడియోను కేంద్ర ప్రభుత్వం ట్విటర్‌ వేదికగా షేర్‌ చేసింది. ‘ఈ కొత్త సంవత్సరాన్ని మన ప్రధాని నరేంద్రమోదీ రాసిన అద్భుతమైన, స్ఫూర్తిదాయక కవితతో ప్రారంభిద్దాం’ అంటూ ట్వీట్‌ చేసింది. ‘తలెత్తి ఆకాశాన్ని చూసినప్పుడు.. దట్టమైన మేఘాలను చీల్చుకుంటూ వెలుతురును ప్రకాశించాలనే సంకల్పంతో  సూర్యుడు ఇప్పుడిప్పుడే ఉదయిస్తున్నాడు’ అంటూ మోదీ గాత్రంతో ఈ వీడియో మొదలవుతుంది. దృఢ నిశ్చయంతో ముందుకెళ్తూ.. ప్రతి కష్టాన్ని అధిగమిస్తే మన జీవితంలోనూ చీకట్లు తొలగి విజయమనే సూర్యుడు ప్రకాశిస్తాడు అన్న మోదీ మాటలు ప్రజల్లో కొత్త సంవత్సరంపై ఆశావాహ దృక్పథాన్ని పెంపొందించేలా ఉన్నాయి. మరి ఈ అద్భుతమైన కవితను మీరూ వినేయండి..!

ఇదీ చదవండి..

కొత్త ఏడాదిలో కలిసికట్టుగా ముందుకుTags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని