మేఘన్‌ ఆరోపణలపై స్పందించిన ప్రిన్స్‌ విలియం!

తాజా వార్తలు

Published : 12/03/2021 01:08 IST

మేఘన్‌ ఆరోపణలపై స్పందించిన ప్రిన్స్‌ విలియం!

లండన్‌: బ్రిటన్‌ రాజకుటుంబంలో తనకు జాతి వివక్ష ఎదురైందని ప్రిన్స్‌ హ్యారీ-మేఘన్‌లు చేసిన ఆరోపణలను హ్యారీ సోదరుడు ప్రిన్స్‌ విలియమ్స్‌ ఖండించారు. తమది జాతి వివక్ష చూపించే కుటుంబం కాదని ప్రిన్స్‌ విలియమ్స్‌ స్పష్టంచేశారు. తూర్పు లండన్‌లో భిన్న వర్గాలకు చెందిన పిల్లలు చదువుకునే ఓ పాఠశాలను సందర్శించిన ప్రిన్స్‌ విలియం దంపతులు అక్కడ మీడియాతో మాట్లాడారు.

రాజ కుటుంబంలో తనకు జాతి వివక్ష ఎదురైందని, మానసిక ఒత్తిడితో ఆత్మహత్య ఆలోచనలు చుట్టుముట్టాయని ఈ మధ్య ఇచ్చిన ఇంటర్వ్యూలో మేఘన్‌ తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. దీనిని ఖండిస్తూ ఇప్పటికే బకింగ్‌హామ్‌ ప్యాలెస్‌ ఓ ప్రకటన చేయగా, తాజాగా ప్రిన్స్‌ విలియం ఆ ఆరోపణలను ఖండించారు. అయితే, ఆ ఇంటర్వ్యూ ఇచ్చిన తర్వాత తన సోదరుడు హ్యారీతో మాట్లాడలేదని, కానీ, తప్పకుండా మాట్లాడుతానని ప్రిన్స్‌ విలియం చెప్పారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని