గణతంత్ర వేడుకల్లో సందడి చేయనున్న రఫేల్‌

తాజా వార్తలు

Published : 18/01/2021 17:41 IST

గణతంత్ర వేడుకల్లో సందడి చేయనున్న రఫేల్‌

 

దిల్లీ: భారత వాయుసేనలో కొత్తగా చేరిన రఫేల్‌ యుద్ధ విమానం ఈ ఏడాది గణతంత్ర దినోత్సవ వేడుకల్లో తొలిసారి సందడి చేయనుంది. జనవరి 26న దిల్లీలో జరిగే రిపబ్లిక్‌ డే పరేడ్‌లో ఒక రఫేల్‌ యుద్ధ విమానం పాల్గొని ‘వర్టికల్‌ ఛార్లీ’ విన్యాసాన్ని ప్రదర్శించనున్నట్లు భారత వైమానిక దళం(ఐఏఎఫ్‌) సోమవారం వెల్లడించింది. వర్టికల్‌ ఛార్లీ ఫార్మేషన్‌లో యుద్ధవిమానం తక్కువ ఎత్తు నుంచి నిలువుగా ప్రయాణించి పైకి వెళ్తుంది. ఈ సారి గణతంత్ర వేడుకల్లో వాయుసేకు చెందిన 38 యుద్ధ విమానాలు, సైన్యానికి చెందిన నాలుగు విమానాలు గగనతలంలో విన్యాసాలు చేయనున్నట్లు వింగ్‌ కమాండర్‌ ఇంద్రనీల్‌ నంది తెలిపారు. 

ఫ్రాన్స్‌ నుంచి 36 రఫేల్‌ యుద్ధ విమానాలను కొనుగోలు చేసేందుకు భారత్‌ 2016లో ఒప్పందం చేసుకున్న విషయం తెలిసిందే. తొలి విడతలో భాగంగా ఐదు రఫేల్‌ విమానాలు గత నెల భారత్‌ చేరుకున్నాయి. సెప్టెంబరు 10న అంబాలా ఎయిర్‌బేస్‌లో ఈ విమానాలను లాంఛనంగా వైమానిక దళంలో చేర్చారు. ప్రస్తుతం ఈ యుద్ధ విమానాలు 17వ స్క్వాడ్రన్‌లో భాగంగా లద్దాఖ్‌లో ఉన్నాయి. 

కరోనా కారణంగా ఈ ఏడాది గణతంత్ర వేడుకల్లో కేంద్రం పలు మార్పులు చేస్తున్నట్లు సమాచారం. వీక్షకుల సంఖ్యను తగ్గించడంతో పాటు భౌతిక దూరం ఉండేలా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. అంతేగాక, పరేడ్ దూరాన్ని కూడా తగ్గించినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.

ఇవీ చదవండి..

భారత్‌-పాక్‌ సరిహద్దులో గణతంత్ర వేడుకలు రద్దు!

రైతుల ర్యాలీకి అనుమతిపై మీదే అధికారం!


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని