Farmers Protest: రైతులకు మద్దతుగా ర్యాలీ.. అకాలీదళ్‌ చీఫ్‌ బాదల్‌, హర్‌సిమ్రత్‌కౌర్‌ అరెస్టు

తాజా వార్తలు

Updated : 17/09/2021 17:01 IST

Farmers Protest: రైతులకు మద్దతుగా ర్యాలీ.. అకాలీదళ్‌ చీఫ్‌ బాదల్‌, హర్‌సిమ్రత్‌కౌర్‌ అరెస్టు

దిల్లీ: శిరోమణి అకాలీదళ్‌(SAD) పార్టీ అధినేత సుఖ్‌బీర్‌సింగ్‌ బాదల్‌, ఆ పార్టీ నేత హర్‌సిమ్రత్‌కౌర్‌ బాదల్‌ సహా 11 మందిని దిల్లీ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. ప్రభుత్వం వద్ద ఎలాంటి అనుమతులు తీసుకోకుండా రైతులకు మద్దతుగా ర్యాలీ నిర్వహించడంతో అరెస్టు చేసినట్లు దిల్లీ పోలీసులు వెల్లడించారు.

ప్రధాని మోదీ అధ్యక్షతన నూతన వ్యవసాయ చట్టాలను అమల్లోకి తీసుకొచ్చి నేటికి ఏడాది కావడంతో సెప్టెంబర్‌ 17వ తేదీని ఎస్‌ఏడీ ‘బ్లాక్‌ డే’గా ప్రకటించింది. వివాదాస్పద వ్యవసాయ చట్టాలకు నిరసనగా దిల్లీలోని గురుద్వారా తాలాబ్‌గంజ్‌ సాహిబ్‌ నుంచి పార్లమెంట్‌ వరకు ర్యాలీ నిర్వహించాలని రైతులకు, పార్టీ కార్యకర్తలకు బాదల్‌ పిలుపునిచ్చారు. పంజాబ్‌ నుంచి రైతులు, వారి మద్దతుదారులు దిల్లీకి తరలివచ్చి రైతులకు నష్టం చేకూర్చేలా ఉన్న మూడు వ్యవసాయ చట్టాల రద్దును డిమాండ్‌ చేస్తూ చేపట్టే ర్యాలీలో పాల్గొనాలని కోరారు.

శుక్రవారం వేలాది మంది గురుద్వారా తాలాబ్‌గంజ్‌ సాహిబ్‌ నుంచి పార్లమెంట్‌ వరకు ర్యాలీ చేపట్టారు. ర్యాలీకి ఎలాంటి అనుమతులు లేవని పేర్కొన్న పోలీసులు.. సుఖ్‌బీర్‌ బాదల్‌, హర్‌సిమ్రత్‌కౌర్‌ సహా పార్టీకి చెందిన మరో 11 మందిని అరెస్టు చేశారు. దీంతో నేతలు, పోలీసుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుని అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని