శామ్‌సంగ్‌ వారసుడికి రెండున్నరేళ్ల జైలుశిక్ష

తాజా వార్తలు

Updated : 18/01/2021 15:54 IST

శామ్‌సంగ్‌ వారసుడికి రెండున్నరేళ్ల జైలుశిక్ష

సియోల్‌: ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రానిక్స్‌, మొబైల్‌ తయారీ సంస్థ శామ్‌సంగ్‌ వారసుడు లీ జే-యాంగ్‌కు రెండున్నర ఏళ్ల జైలు శిక్ష పడింది. మూడేళ్ల క్రితం అవినీతి ఆరోపణలు, ప్రభుత్వం నుంచి లబ్ధి పొందేందుకు నాటి దక్షిణ కొరియా అధ్యక్షురాలు పార్క్‌ గుయిన్‌-హెయికు లంచం ఇచ్చారన్న ఆరోపణలపై 2017లో లీ జే-యాంగ్‌ అరెస్టు అయ్యారు. కేసును విచారించిన కోర్టు ఆయనకు ఐదేళ్లు జైలు శిక్ష విధించింది. అయితే, తనకు విధించిన శిక్షపై లీ జే-యాంగ్‌ అప్పీలేట్‌ కోర్టును ఆశ్రయించగా.. న్యాయస్థానం 2018లో అతడి శిక్షను తాత్కాలికంగా నిలిపివేసింది. కాగా, 2019 ఆగస్టులో ఈ కేసు దక్షిణ కొరియా సుప్రీంకోర్టు ముందుకు వచ్చింది. దీంతో లీ జే-యాంగ్‌ శిక్షను తాత్కాలికంగా నిలిపివేయడాన్ని సమీక్షించాలని సియోల్‌ హైకోర్టును ఆదేశించింది. సుప్రీం ఆదేశాల మేరకు విచారణ జరిపిన హైకోర్టు లీ జే-యాంగ్‌కు రెండున్నర ఏళ్లు శిక్ష విధిస్తూ సోమవారం తీర్పు వెలువరించింది.

52ఏళ్ల లీ జే-యాంగ్‌.. శామ్‌సంగ్‌ గ్రూప్‌ అధినేత లీ కున్‌-హీ పెద్ద కుమారుడు. తండ్రి లీ కున్‌-హీ గతేడాది అక్టోబర్‌ 25న అనారోగ్యంతో మృతి చెందారు. ఈ తీర్పుతో కంపెనీలో కీలక నిర్ణయాలు తీసుకొనే బాధ్యతల నుంచి కూడా ఆయన తాత్కాలికంగా దూరమయ్యారు. తండ్రి వారసత్వాన్ని అందుకునే ప్రక్రియను కూడా ఆయన పర్యవేక్షించలేరు.  

ఇదీ చదవండి..

శామ్‌సంగ్‌ కొత్త ఆవిష్కరణలు ఏంటో తెలుసా?


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని