అంగారకుడిపైకి రహస్య సందేశం!

తాజా వార్తలు

Published : 25/02/2021 09:57 IST

అంగారకుడిపైకి రహస్య సందేశం!

భారీ పారాచూట్‌పై సృజనాత్మకంగా ఆవిష్కరణ 

కేప్‌ కెనావెరాల్‌: అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ- నాసాకు చెందిన ప్రతిష్ఠాత్మక పర్సెవరెన్స్‌ రోవర్‌ అంగారకుడి ఉపరితలంపై సురక్షితంగా దిగడంలో కీలక పాత్ర పోషించిన భారీ పారాచూట్‌ తనతోపాటు ఓ రహస్య సందేశాన్ని మోసుకెళ్లింది. ‘‘గొప్ప పనుల కోసం ధైర్యంగా ప్రయత్నించండి’’ అని ఈ 70 అడుగుల పారాచూట్‌పై సిస్టమ్స్‌ ఇంజినీర్‌ ఇయాన్‌ క్లార్క్‌ బైనరీ కోడ్‌ల ద్వారా రాశారు. పజిల్‌లను బాగా ఇష్టపడే క్లార్క్‌కు ఇలాంటి సందేశాన్ని పంపించాలన్న ఆలోచన రెండేళ్ల క్రితమే వచ్చిందట. దీంతో బాగా ఆలోచించి.. అమెరికా మాజీ అధ్యక్షుడు థియోడర్‌ రూజ్‌వెల్ట్‌ చెప్పిన మాట- ‘‘గొప్ప పనుల కోసం ధైర్యంగా ప్రయత్నించండి’’ని పారాచూట్‌పై కోడ్‌ల ద్వారా సృజనాత్మకంగా ఆవిష్కరించారు. పర్సెవరెన్స్‌ అంగారకుడిపై దిగేంత వరకు ఆ రహస్య సందేశం గురించి కేవలం ఆరుగురికే తెలుసట. కాలిఫోర్నియాలోని జెట్‌ ప్రొపల్షన్‌ ప్రయోగశాల (జేపీఎల్‌) ప్రధాన కార్యాలయం జీపీఎస్‌ కోఆర్డినేట్స్‌ను కూడా పారాచూట్‌పై పొందుపర్చడం విశేషం. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని