UNGA: ఐరాస అసెంబ్లీని సూపర్‌ స్ప్రెడర్‌ ఈవెంట్‌గా మార్చొద్దు..

తాజా వార్తలు

Published : 23/08/2021 01:22 IST

UNGA: ఐరాస అసెంబ్లీని సూపర్‌ స్ప్రెడర్‌ ఈవెంట్‌గా మార్చొద్దు..

ఇంటర్నెట్‌డెస్క్‌: కొవిడ్‌ డెల్టావేరియంట్‌ వ్యాప్తి భయం ఐరాస జనరల్‌ అసెంబ్లీ సమావేశాలను కూడా తాకింది. ఈ నేపథ్యంలో జనరల్‌ అసెంబ్లీలో ప్రసంగించాల్సిన నేతలు న్యూయార్క్‌కు రాకుండా వీడియో సందేశాలను పంపించాలని అమెరికా కోరింది. ఈ సమావేశం వచ్చేనెల జరగనుంది. ‘అత్యున్నత స్థాయి కార్యక్రమాన్ని సూపర్‌ స్ప్రెడర్‌ ఈవెంట్‌గా మార్చవద్దు’ అని కోరింది. ఐరాసలోని అమెరికా ప్రతినిధి లిండా థామస్‌ గ్రీన్‌ ఫీల్డ్‌ 193 సభ్యదేశాలకు ఈ మేరకు లేఖ రాశారు. సభ్యదేశాల ప్రతినిధులు చర్చలో వీడియో మాధ్యమంలో సందేశాలు ఇచ్చే అంశాన్ని పరిశీలించాలని కోరారు. 
 ఐరాస ప్రధాన కార్యాలయంలో అమెరికాలో ఉండటంతో వచ్చే అతిథులకు భద్రత, న్యూయార్క్‌ వాసుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకొన్నారు. ఐరాస సెక్రటేరియట్‌, జనరల్‌ అసెంబ్లీ అధ్యక్షులు కూడా ఈ కీలకమైన కార్యక్రమాన్ని కరోనా వ్యాప్తికి కారణంగా మారకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. 

ఐరాస జనరల్‌ అసెంబ్లీ సమావేశాలు సెప్టెంబర్‌ 21-27 మధ్య జరగనున్నాయి. ఐరాస డేటాబేస్‌ ప్రకారం భారత ప్రధాని నరేంద్ర మోదీ సెప్టెంబర్‌ 25వ తేదీన ప్రసంగించాల్సి ఉంది. మొత్తం 167 దేశాల ప్రభుత్వాధినేతలు, 29 మంది మంత్రులు లేదా దౌత్యవేత్తలు ఇందులో వారి సందేశాలను ఇవ్వాల్సి ఉంది. 40 దేశాల నేతలు ఇప్పటికే వీడియో మాధ్యమంలో సందేశం పంపేందుకు పేర్లు నమోదు చేసుకొన్నారు. ఈ జాబితాలో ఇరాన్‌,ఈజిప్ట్‌,సౌతాఫ్రికా,నేపాల్‌ దేశాలు ఉన్నాయి. ఇక అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌ మాత్రం వ్యక్తిగత స్థాయిలో హాజరై ప్రసంగించనున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని