Russia: యూనివర్శిటీలో విద్యార్థి కాల్పులు.. 8 మంది మృతి

తాజా వార్తలు

Updated : 20/09/2021 16:23 IST

Russia: యూనివర్శిటీలో విద్యార్థి కాల్పులు.. 8 మంది మృతి

మాస్కో: రష్యాలోని పెర్మ్‌ క్రెయ్‌ ప్రాంతంలో గల పెర్మ్‌ స్టేట్‌ యూనివర్శిటీలో కాల్పులు చోటుచేసుకున్నాయి. అదే విశ్వవిద్యాలయంలో చదువుతోన్న ఓ 18 ఏళ్ల విద్యార్థి తోటి విద్యార్థులపై కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో 8 మంది ప్రాణాలు కోల్పోగా.. పలువురు గాయపడ్డారు.

సోమవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో విశ్వవిద్యాలయంలోకి తుపాకీతో వచ్చిన నిందితుడు విచక్షణారహితంగా కాల్పులకు పాల్పడ్డాడు. తుపాకీ శబ్దాలతో ఉలిక్కిపడ్డ ఉపాధ్యాయులు, విద్యార్థులు భయంతో పరుగులు తీశారు. కొంతమంది ఆడిటోరియంలోకి వెళ్లి దాక్కోగా.. మరికొందరు కిటికీల నుంచి దూకి బయటకు పరిగెత్తారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడి అదుపులోకి తీసుకున్నారు. ఈ కాల్పుల్లో 8 మంది మరణించినట్లు అధికారులు వెల్లడించారు. మరో ఆరుగురు గాయపడినట్లు తెలుస్తోంది. ఘటనపై రష్యా ఇన్వెస్టిగేషన్ కమిటీ దర్యాప్తు చేపట్టింది. నిందితుడు కాల్పులకు తెగబడటానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. 

నిందితుడు క్యాంపస్‌లోకి ప్రవేశిస్తున్న దృశ్యాలు.. విద్యార్థులు కిటికీలోంచి దూకుతున్న వీడియోలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని