బెంగాల్‌లో కొనసాగుతున్న ఆరో దశ పోలింగ్‌

తాజా వార్తలు

Published : 22/04/2021 08:23 IST

బెంగాల్‌లో కొనసాగుతున్న ఆరో దశ పోలింగ్‌

కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా గురువారం ఆరోదశ పోలింగ్‌ కొనసాగుతోంది. ఈ దశలో భాగంగా మొత్తం 43 నియోజకవర్గాల్లో పోలింగ్‌ జరుగుతోంది. 43 స్థానాల పరిధిలో మొత్తం 1.03 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. ఉదయం ఏడు గంటలకు పోలింగ్‌ ప్రారంభం కాగా, ప్రజలు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్‌ కేంద్రాల వద్ద ఇప్పటికే బారులు తీరారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కేంద్ర బలగాలతో పటిష్ఠమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోవైపు, కరోనా ఉద్ధృతి నేపథ్యంలో ఓటర్లు వైరస్‌ బారిన పడకుండా జాగ్రత్త చర్యలు చేపట్టారు.  ఈ దశలో మొత్తం 306 మంది అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంలలో నిక్షిప్తం కానుంది. 

ప్రతిఒక్కరూ ఓటు వేయాలి: మోదీ
బెంగాల్‌లో ఆరోదశ పోలింగ్‌ సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ ట్వీట్‌ చేశారు ‘ఈ రోజు బెంగాల్‌ అసెంబ్లీకి ఆరో దశ ఎన్నికల పోలింగ్‌ జరుగుతోంది. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరుతున్నా’ అని కోరారు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని