స్మృతి ఇరానీకి కరోనా పాజిటివ్‌!

తాజా వార్తలు

Updated : 28/10/2020 20:07 IST

స్మృతి ఇరానీకి కరోనా పాజిటివ్‌!

దిల్లీ: కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి స్మృతి ఇరానీ కరోనా బారిన పడ్డారు. ఆమెకు బుధవారం పరీక్షలు నిర్వహించగా... కరోనా పాజిటివ్‌గా తేలింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. ‘నాకు కరోనా వైరస్‌ పాజిటివ్‌గా నిర్దరణ అయింది. ఇటీవల నన్ను సంప్రదించిన వ్యక్తులు వీలైనంత త్వరగా పరీక్షలు చేయించుకొని.. సురక్షితంగా ఉండాలి’అని స్మృతి ట్వీట్‌ ద్వారా విజ్ఞప్తి చేశారు. కాగా మంగళవారం కూడా మరో కేంద్రమంత్రి రాందాస్‌ అథవాలేకు కరోనా సోకిన విషయం తెలిసిందే. కాగా దేశంలో కరోనా వైరస్‌ కేసులు 80లక్షలకు చేరుకున్నాయి. మరణాల సంఖ్య 1.20లక్షలకు చేరింది. గడిచిన 24గంటల్లో 43వేల కేసులు నమోదు కాగా.. 58వేల మంది మహమ్మారి నుంచి రికవరీ అయ్యారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని