ఆ గ్రామ క‘న్నీటి’ కష్టాలు తీర్చిన సోనూ

తాజా వార్తలు

Published : 26/02/2021 20:45 IST

ఆ గ్రామ క‘న్నీటి’ కష్టాలు తీర్చిన సోనూ

లఖ్‌నవూ: బాలీవుడ్‌ నటుడు సోనూసూద్‌ మరోసారి తన ఔదార్యం చాటుకున్నారు. తీవ్ర నీటి ఎద్దడితో వెతలు అనుభవిస్తున్న ఓ గ్రామ ప్రజల పాలిట అతడు భగీరథుడయ్యాడు. చేతి పంపులు బిగించి అక్కడి ప్రజల దప్పికను తీర్చి మరోసారి వార్తల్లో నిలిచాడు.

యూపీలోని ఝాన్సీ పరిధిలో ఓ గ్రామానికి చెందిన వ్యక్తి.. తమ గ్రామంలో నీటి సమస్య ఉందంటూ సోనూసూద్‌ను సంప్రదించాడు. దీనికి స్పందించిన సోనూ.. గ్రామంలో చేతి పంపులు బిగించాడు. ‘‘ఆ గ్రామంలో నీటి ఎద్దడి ఉందని, తాగునీటి కోసం కిలోమీటర్ల మేర నడుస్తున్నామని అక్కడి వారు చెప్పడంతో పంపులు ఏర్పాటు చేశాడు. తద్వారా ఆ గ్రామస్థుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి’’ అని సోనూ తెలిపాడు. ఏదో ఒక రోజు ఆ గ్రామానికి వెళ్లి ఆ పంపులో వచ్చే మంచి నీటిని తాగుతానని చెప్పుకొచ్చాడు.

కరోనా కష్ట కాలంలోనూ సోనూ పలు సేవా కార్యక్రమాలు చేశారు. ఇటీవల ఉత్తరాఖండ్‌ వరదల్లో మృతి చెందిన ఓ వ్యక్తి కుటుంబానికి సైతం తన వంతు సాయం అందించాడు. ఇక సినిమాల విషయానికి వస్తే మెగాస్టార్‌ చిరంజీవి కథానాయకుడిగా తెరకెక్కబోతున్న ‘ఆచార్య’లో సందడి చేయనున్నాడు. ఈ.నివాస్‌ దర్శకత్వంలో రాబోతున్న ‘కిసాన్‌’ చిత్రానికి కూడా సోనూ ఓకే చెప్పేశాడు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని