Nelson Mandela: వేలానికి నెల్సన్‌ మండేలా వస్తువులు!

తాజా వార్తలు

Updated : 17/10/2021 20:46 IST

Nelson Mandela: వేలానికి నెల్సన్‌ మండేలా వస్తువులు!

ఇంటర్నెట్‌ డెస్క్‌: దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు, నోబెల్‌ శాంతి బహుమతి గ్రహీత దివంగత నెల్సన్‌ మండేలాకు చెందిన దాదాపు వంద వస్తువులను ఆయన కుటుంబ సభ్యులు వేలానికి పెట్టారు. వాటిలో అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా సహా వివిధ దేశాధినేతలు నెల్సన్‌ మండెలాకు ఇచ్చిన బహుమతులు, ఆయన ఉపయోగించిన కళ్లజోడు, సూట్‌కేసు, ప్యాంట్లు, చొక్కాలు ఉన్నాయి. అలాగే నెల్సన్‌ మండేలా బ్రిటన్‌ రాణి ఎలిజబెత్‌ను 1998, 2003లో కలిసినప్పుడు, పలు కీలక కార్యక్రమాల సమయంలో ధరించిన ప్రత్యేకమైన రంగురంగుల చొక్కా కూడా ఉంది.

ఈ వేలం ద్వారా వచ్చిన డబ్బుతో కును ప్రాంతంలో నెల్సన్‌ మండేలా గౌరవార్థం మెమోరియల్‌ గార్డెన్‌ నిర్మించనున్నారు. నెల్సన్‌ 2013లో 95ఏళ్ల వయసులో కన్నుమూయగా.. ఆయన్ను ఈ ప్రాంతంలోనే ఖననం చేశారు. అందుకే ఇక్కడే మెమోరియల్‌ గార్డెన్‌ నిర్మించాలని నెల్సన్‌ కుటుంబసభ్యులు నిర్ణయించారు. నిధుల సేకరణ కోసం చేపట్టిన ఈ వేలాన్ని న్యూయార్క్‌కు చెందిన గ్వెర్నెసీ అనే ఆక్షన్‌ సంస్థ డిసెంబర్‌ 11న ఆన్‌లైన్‌లో నిర్వహించబోతుంది.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని