Vaccine: రాష్ట్రాలకు త్వరలో మరో 11లక్షల డోసులు! 

తాజా వార్తలు

Updated : 27/05/2021 16:53 IST

Vaccine: రాష్ట్రాలకు త్వరలో మరో 11లక్షల డోసులు! 

దిల్లీ: కరోనా విజృంభణ వేళ టీకాల కొరతతో అల్లాడుతున్న రాష్ట్రాలకు మూడు రోజుల్లో మరో 11లక్షలకు పైగా డోసులు పంపిణీ చేయనున్నట్టు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. కేంద్రప్రభుత్వం ఇప్పటివరకు 22,16,11,940 టీకా డోసులను (కేంద్రం ఉచితంగా పంపిణీ చేసినవి.. రాష్ట్రాలు నేరుగా సేకరించినవి) రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు అందుబాటులో ఉంచగా.. 20,17,59,768 టీకాలు (వృథాతో పాటు) వినియోగించినట్టు తెలిపింది. ప్రస్తుతం 1,84,90,522 డోసులు రాష్ట్రాల వద్ద అందుబాటులో ఉన్నాయని పేర్కొంది.

మరోవైపు, దేశంలో కరోనా కట్టడికి వ్యాక్సినేషన్‌ ప్రక్రియ కొనసాగుతోంది. నిన్న ఒక్కరోజే దేశవ్యాప్తంగా 21.5లక్షల మందికి పైగా టీకాలు వేసినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్దన్‌ వెల్లడించారు. 20 కోట్ల వ్యాక్సిన్‌ డోసుల పంపిణీలో అమెరికా అగ్రస్థానంలో ఉండగా.. ఆ తర్వాత భారతదేశమే నిలిచిందని తెలిపారు. 20కోట్ల డోసుల పంపిణీకి అగ్రరాజ్యంలో 124 రోజుల సమయం పట్టగా.. భారత్‌కు 130 రోజులు పట్టిందని ట్విటర్‌లో పేర్కొన్నారు. రోజువారీ రికవరీలు వరుసగా 14వ రోజూ పాజిటివ్‌ కేసుల కన్నా అధికంగానే  నమోదైనట్టు హర్షవర్దన్‌ తెలిపారు. రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు ఇప్పటివరకు 22కోట్ల టీకా డోసులు పంపిణీ చేశామని, ప్రస్తుతం ఆయా రాష్ట్రాల వద్ద 1.84కోట్ల డోసులు అందుబాటులో ఉన్నట్టు కేంద్రమంత్రి తెలిపారు. అలాగే, దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 33.6కోట్ల మందికి కొవిడ్‌ పరీక్షలు చేసినట్టు ఆయన పేర్కొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని