జపాన్‌లో భూకంపం

తాజా వార్తలు

Published : 20/03/2021 18:11 IST

జపాన్‌లో భూకంపం

టోక్యో: ఉత్తర జపాన్‌లో భూకంపం సంభవించింది. మియాగి ప్రాంతంలో సంభవించిన ప్రకంపనల ధాటికి భవనాలు కదలడంతో ప్రజలు భయాందోళన చెందారు. భూకంప తీవ్రత జపాన్‌ రాజధాని నగరం టోక్యోను కూడా తాకాయి. భూకంపం నేపథ్యంలో సునామీ హెచ్చరికలు జారీ చేసినప్పటికీ కాసేపటికే వెనక్కి తీసుకున్నారు. రిక్టర్‌ స్కేలుపై దీని తీవ్రత 7.0గా ఉన్నట్లు యూఎస్‌ జియోలాజికల్‌ సర్వే పేర్కొంది. 54 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు తెలిపింది.

2011లో సంభవించిన భారీ భూకంపం, సునామీ ధాటికి భారీగా దెబ్బతిన్న మియాగి ప్రాంతంలో మరోసారి భూకంపం సంభవించింది. తొలుత జపాన్‌ మెట్రోలాజికల్‌ ఏజెన్సీ సునామీ హెచ్చరికలు జారీ చేసింది. మీటరు వరకు అలలు ఎగసిపడతాయని హెచ్చరించింది. 90 నిమిషాల తర్వాత హెచ్చరికలను వెనక్కి తీసుకుంది. భూకంపం కారణంగా ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించచలేదని అధికారులు పేర్కొన్నారు. అలాగే ఈ ప్రాంతంలో ఉన్న అణు రియాక్టర్లపైనా ఎలాంటి ప్రభావం పడలేదని తెలిపారు. కాసేపు బుల్లెట్‌రైలు సేవలు నిలిచిపోయినట్లు స్థానిక మీడియా పేర్కొంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని