Pegasus Spyware: పెగాసస్‌పై గురువారం సుప్రీంకోర్టులో విచారణ

తాజా వార్తలు

Published : 01/08/2021 10:45 IST

Pegasus Spyware: పెగాసస్‌పై గురువారం సుప్రీంకోర్టులో విచారణ

దిల్లీ: వర్షాకాల పార్లమెంటు సమావేశాలను కుదిపేసిన పెగాసస్‌ స్పైవేర్‌ వ్యవహారానికి సంబంధించి దాఖలైన వ్యాజ్యంపై గురువారం సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ద్విసభ్య ధర్మాసనం దీనిపై వాదనలు విననుంది. దీనిపై ప్రస్తుత లేదా విశ్రాంత న్యాయమూర్తితో స్వతంత్రంగా దర్యాప్తు జరిపించాలని కోరుతూ ప్రముఖ పాత్రికేయులు ఎన్‌.రామ్‌, శశికుమార్‌ సహా సీపీఎం ఎంపీ జాన్‌ బ్రిట్టాస్‌, న్యాయవాది ఎం.ఎల్‌.శర్మ వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ వ్యవహారం పర్యవసానాలు చాలా అధికంగా ఉన్నందున.. అసలు ప్రభుత్వం ఈ స్పైవేర్‌ వినియోగానికి అనుమతులు తీసుకుందా.. లేదా.. అన్న విషయం బహిర్గం చేసేలా ఆదేశాలివ్వాలని విజ్ఞప్తి చేశారు. వీరి వినతిని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ ఆధ్వర్యంలోని ధర్మాసనం శుక్రవారం అంగీకరించింది. దీనిపై గురువారం విచారణ చేపట్టనున్నట్లు తాజాగా సుప్రీం కోర్టు వర్గాలు తెలిపాయి.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని