Cow Dung: ‘ఆవుపేడ’ అని పిలుస్తున్నందుకు గర్వంగా ఉంది: ఎంపీ సురేష్‌ గోపి

తాజా వార్తలు

Published : 21/08/2021 01:32 IST

Cow Dung: ‘ఆవుపేడ’ అని పిలుస్తున్నందుకు గర్వంగా ఉంది: ఎంపీ సురేష్‌ గోపి

కొచ్చి: ‘‘నన్ను ‘ఆవుపేడ’ అని పిలుస్తున్నందుకు సిగ్గుపడటం లేదు. నిజం చెప్పాలంటే గర్వంగా ఉంది’’ అని ఆనందాన్ని వ్యక్తం చేశారు నటుడు, భాజపా రాజ్యసభ సభ్యుడు సురేష్‌ గోపి. ఇటీవలే కొచ్చిలోని కాలూర్‌లో విశ్వహిందూ పరిషత్‌(వీహెచ్‌పీ) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గోవు రక్ష యాత్ర ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సంఘ్‌ పరివార్‌తో కలిసి ఈ కార్యక్రమానికి హాజరైనందుకు గానూ కొందరు సోషల్‌ మీడియాలో గ్రూపులుగా ఏర్పడి సురేష్‌ గోపి ‘ఆవుపేడ’ అని విమర్శలు చేయడం ప్రారంభించారు. అయినా సరే వాటిని పట్టించుకోనని, అనే వాళ్లు ఎన్ని అయినా అనుకోండి అంటూ విమర్శకులకు బదులిచ్చారు. స్వామి వివేకానంద కల్చరల్‌ సొసైటీతో వీహెచ్‌వీ అనుసంధానమై కేరళలో ఈ  కార్యక్రమాన్ని ప్రారంభించారు. గోవుల సంరక్షణ, సేంద్రియ సాగు, పాల ఉత్పత్తి పెంచడంతో పాటు ప్రజలు సంప్రదాయమైన జీవనశైలిని అలవరచుకునేలా ప్రోత్సహించడమే దీని ముఖ్య ఉద్దేశం.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని