Shyama Prasad Mukherjee: ప్రముఖల నివాళి

తాజా వార్తలు

Published : 06/07/2021 13:37 IST

 Shyama Prasad Mukherjee: ప్రముఖల నివాళి

దిల్లీ: జన్‌సంఘ్‌ వ్యవస్థాపకులు శ్యామాప్రసాద్‌ ముఖర్జీ 120వ జయంతి సందర్భంగా మంగళవారం ప్రముఖులు ఆయన సేవలను స్మరించుకున్నారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ ట్విటర్ వేదికగా ఆయనకు నివాళులు అర్పించారు. 

‘భరతమాత ముద్దుబిడ్డ, రాజనీతిజ్ఞుడు డా.శ్యామాప్రసాద్ ముఖర్జీ జయంతి సందర్భంగా వారి దివ్యస్మృతికి నివాళులు అర్పిస్తున్నాను. భారతదేశ ఐక్యత, సమగ్రతను కాపాడే దిశగా వారు చేసిన పోరాటం ప్రతి భారతీయుడికి ప్రేరణాత్మకం. విలువల కోసం కట్టుబడిన వారి జీవితం యువతకు స్ఫూర్తిదాయకం. స్వాతంత్ర్యానంతరం భారతదేశంలో జాతీయవాద రాజకీయాలను ముందుకు నడిపేందుకు జన్‌సంఘ్‌ను స్థాపించి, ఎందరికో మార్గదర్శనం చేసిన శ్రీ శ్యామాప్రసాద్ ముఖర్జీ ‘ఏక్‌ దేశ్‌మే దో నిశాన్‌, దో ప్రధాన్‌, దో విధాన్ నహీ చలేగా’ అని నినదించి, సాకారం చేసే ప్రయత్నంలో చేసిన త్యాగం చిరస్మరణీయం...’- వెంకయ్యనాయుడు

డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ జయంతి సందర్భంగా ఆయనకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఆయన ఉన్నతమైన ఆదర్శాలు ఎందరికో ప్రేరణనిస్తాయి. ఆయన తన జీవితాన్ని దేశ ఐక్యత, పురోగతి కోసం అంకితం చేశారు...ప్రధాని మోదీ.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని