Afghanistan: అఫ్గాన్‌లో మహిళలు చదువుకోవచ్చు! కానీ..

తాజా వార్తలు

Updated : 12/09/2021 14:21 IST

Afghanistan: అఫ్గాన్‌లో మహిళలు చదువుకోవచ్చు! కానీ..

కాబుల్‌: అఫ్గాన్‌లో ఏర్పాటైన తాలిబన్‌ తాత్కాలిక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మహిళలు యూనివర్సిటీలు, పీజీ స్థాయిలో చదువుకోవచ్చని ప్రకటించింది. అయితే, పురుషులతో కలిసి విద్యనభ్యసించడం మాత్రం కుదరదని స్పష్టం చేసింది. మహిళలు, పురుషులకు ప్రత్యేక తరగతి గదులు ఉండాలని పేర్కొంది. ఈ మేరకు ఉన్నత విద్యావిధానాన్ని ఆదివారం విద్యాశాఖ మంత్రి అబ్దుల్‌ బాఖీ హక్కానీ ప్రకటించారు.

చదువుకునే మహిళలు కచ్చితంగా ప్రత్యేక డ్రెస్‌ కోడ్‌ పాటించాలని తాలిబన్‌ ప్రభుత్వం తెలిపింది. ‘హిజబ్‌’లు కచ్చితంగా ధరించాలని పేర్కొంది. అయితే, తలతో పాటు ముఖం కూడా కనిపించకుండా స్కార్ఫ్‌లు ధరించాలా.. లేక తలకు మాత్రమే సరిపోతుందా అన్న విషయంపై స్పష్టతనివ్వలేదు. అలాగే యూనివర్సిటీ బోధనాశాంల్లోనూ మార్పులు తీసుకొస్తామని అబ్దుల్‌ బాఖీ హక్కానీ ప్రకటించారు. ఎలాంటి మార్పులన్నది మాత్రం వెల్లడించలేదు. తాము కాలాన్ని 20 ఏళ్లకు తిరిగి తీసుకెళ్లాలనుకోవడం లేదని.. ఇప్పుడు ఉన్న పునాదులపైనే పునఃనిర్మాణాన్ని చేపడతామని హక్కానీ ప్రకటించడం గమనార్హం.

1990ల నాటి పాలనలో తాలిబన్లు మహిళలను చదువుకోవడానికి అనుమతించలేదు. వారిని పూర్తిగా ఇంటికే పరిమితం చేశారు. దీంతో తాలిబన్లు మరోసారి అధికారంలోకి రాగానే నాటి పరిస్థితులు తలెత్తే అవకాశం ఉందని అంతా ఆందోళన చెందారు. అయితే, తమ పాలన క్రితంతో పోలిస్తే భిన్నంగా ఉంటుందని తాలిబన్లు తొలినుంచి చెబుతూ వస్తున్నారు. దీంతో తాలిబన్ల వైఖరిని ప్రపంచదేశాలు నిశితంగా గమనిస్తున్నాయి.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని