Afghanistan: ‘మా పెన్నులు విరగ్గొట్టొద్దు.. మా పుస్తకాలను కాల్చొద్దు..’

తాజా వార్తలు

Published : 01/10/2021 01:55 IST

Afghanistan: ‘మా పెన్నులు విరగ్గొట్టొద్దు.. మా పుస్తకాలను కాల్చొద్దు..’

కాబుల్‌లో మహిళల నిరసనను అడ్డుకున్న తాలిబన్లు.. గాల్లో కాల్పులు

కాబుల్‌: విద్య, ఉద్యోగ తదితర రంగాల్లో తమ హక్కులను కాలరాయొద్దంటూ అఫ్గాన్‌ మహిళలు చేపడుతున్న నిరసనలపై తాలిబన్లు విరుచుకుపడుతున్న విషయం తెలిసిందే. తాజాగా కాబుల్‌లో ప్రదర్శన చేపట్టిన మహిళలపై వారు హింసాత్మక ధోరణి ప్రదర్శించారు. 6- 12 తరగతుల బాలికలనూ బడులకు అనుమతించాలంటూ ‘స్పాంటేనియస్‌ మూవ్‌మెంట్‌ ఆఫ్‌ అఫ్గాన్‌ వుమెన్‌ యాక్టివిస్ట్స్‌’ బృందానికి చెందిన పలువురు మహిళలు గురువారం స్థానికంగా ఓ సెకండరీ స్కూల్‌ ముందు నిరసనకు దిగారు. ‘మా పెన్నులు విరగ్గొట్టొద్దు. మా పుస్తకాలను కాల్చొద్దు. మా పాఠశాలలను మూసివేయొద్దు’.. ఇలా వివిధ నినాదాలు రాసి ఉన్న బ్యానర్లను ప్రదర్శించారు. ఇది గమనించిన తాలిబన్లు వెంటనే వారిని అడ్డుకున్నారు. వెనక్కి నెట్టేసి, బ్యానర్లు లాగేసుకున్నారు. వారిని అదుపుచేసేందుకు గాల్లో కాల్పులు సైతం జరిపినట్లు ఓ వార్త సంస్థ వెల్లడించింది. ఈ క్రమంలో వారి దుశ్చర్యలను రికార్డు చేస్తున్న విదేశీ జర్నలిస్టులనూ నిలువరించినట్లు పేర్కొంది. మహిళలను అడ్డుకున్న తాలిబన్ల బృందానికి నాయకత్వంవహించిన మౌలావి నస్రతుల్లా ఈ విషయమై మాట్లాడుతూ.. నిరసనకారులు తమ ప్రదర్శనకు సంబంధించి అనుమతులు తీసుకోలేదని వివరించారు. అఫ్గాన్‌లో 6- 12 తరగతులకు కేవలం బాలురను మాత్రమే అనుమతిస్తూ తాలిబన్లు ఇటీవల ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. మహిళల హక్కుల విషయంలోనూ వారు మొదటి నుంచి కఠినంగా వ్యవహరిస్తూ వస్తున్నారు. వారి దుశ్చర్యలను నిరసిస్తూ.. హెరాత్‌, కాబుల్‌ తదితర చోట్ల గళం విప్పిన మహిళలపై తమ ప్రతాపాన్ని ప్రదర్శించిన విషయం తెలిసిందే.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని